TDP Leader Pattabhi Ram on Siemens Project: సిద్ధం చేసుకున్న అబద్ధాలతో చంద్రబాబును దోషిగా చూపిస్తున్నారు : టీడీపీ నేత పట్టాభి - సీఎం జగన్​పై టీడీపీ పట్టాభి ఫైర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 10:48 AM IST

TDP Leader Pattabhi Ram on Siemens Project: సీమెన్స్‌ ప్రాజెక్టులో ఆ సంస్థ 90% గ్రాంటు, రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా చెల్లిస్తుందని ఒప్పందంలో ఉందని, మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే విషయాన్ని తీర్మానించారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ స్పష్టం చేశారు. నైపుణ్య శిక్షణకు సంబంధించి ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఉన్నామని సీమెన్స్ ఉన్నతాధికారులు మెయిల్స్‌ పంపడమే కాదు.. అప్పుటి ఒప్పందంపై ఆ సంస్థ ఉన్నతాధికారులు సంతకాలు కూడా చేశారని తెలిపారు. కానీ సిద్ధం చేసుకున్న అబద్ధాలతో చంద్రబాబును దోషిగా చూపిస్తున్న ప్రభుత్వం, సీఐడీలు.. ప్రాజెక్టు ఒప్పందంలోని అంశాలను కావాలనే దాచి పెడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంతో సీమెన్స్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని..షెల్‌ సంస్థలకు నిధులు మళ్లించిందంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేసి అరెస్ట్ చేయించించారని మండిపడ్డారు. ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వం మదింపు సంస్థ సీమెన్స్ ప్రాజెక్ట్‌లోని సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను మదించి నిర్థిరించినా.. అక్కడ సాప్ట్‌వేరే లేదంటూ బుకాయిస్తోందని అన్నారు. ఈ క్రమంలో టీడీపీ పట్టాభిరామ్.. చంద్రబాబు అరెస్టు కేసులో నిజనిజాలు ఏంటో ప్రజలకు అర్ధమవుతున్నాయని పట్టాభి పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.