ఆర్యవైశ్యులపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది: డూండి రాకేశ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 3:34 PM IST
TDP Leader Doondi Rakesh Fire on CM Jagan: ఆర్యవైశ్యులకు తెలుగుదేశం ఏం చేసిందో, జగన్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించటానికి తాను సిద్ధమని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్ స్పష్టంచేశారు. డిసెంబర్ 3న ఉదయం 11.30 గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రెడి అని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.
TDP Rakesh on Arya Vaishyas: ఆర్యవైశ్యులపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. వైశ్యుల్లో చీలికలు తెచ్చి, వైశ్యుల ఓటు బ్యాంకు లేదనటానికి సిద్ధమైందని దుయ్యబట్టారు. కులగణనలో భాగంగా ఆర్యవైశ్యుల్లోని కోమటి, గుప్త, శెట్టిలు వారిని విభజించడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 723 కులాల పేర్లల్లో ఆర్యవైశ్య కులం పేరు లేకపోవడం బాధాకరమని వాపోయారు. వైసీపీలోని ఆర్యవైశ్య నాయకులు ఎందుకు నోరు పెదపడంలేదని ప్రశ్నించారు. 14వేల 600 మంది పేద వైశ్యులు సత్యనారాయణ వ్రతం చేసుకునేందుకు అడ్డంకులు సృష్టించడం తగదని ఆక్షేపించారు.