ETV Bharat / state

ఎమ్మార్వో ఆఫీసు ఎదుట బట్టలు ఉతికిన రైతు - అధికారులు షాక్

శ్రీసత్యసాయి జిల్లా కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆందోళన - కాలసముద్రం గ్రామానికి చెందిన గంగులప్ప బట్టలు ఉతుకుతూ వినూత్న నిరసన

Farmer_Agitation_At_MRO_Office
Farmer Agitation At MRO Office (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Farmer Agitation At MRO Office: ఎన్నో ఎళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూమిని నకిలీ రికార్డులతో ఇతరులకు కేటాయించడంతో ఓ రైతు వినూత్న నిరసన చేపట్టారు. దీంతో రైతు ఆందోళన చూసి అధికారులు, అక్కడున్న ప్రజలు షాక్​కు గురయ్యారు. తన సమస్యను పరిష్కరిస్తామంటూ అధికారులు దిగొచ్చారు.

ఇదీ జరిగింది: పూర్వీకుల నుంచి తన కుటుంబానికి సంక్రమించిన భూమిని నకిలీ రికార్డులతో ఇతరులకు కేటాయించారంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు ఉతుకుతూ నిరసన తెలియజేశారు. శ్రీ సత్య సాయి జిల్లా కాలసముద్రం రెవెన్యూ గ్రామంలో రైతు గంగులప్పకు పెద్దలనుంచి భూమి సంక్రమించింది.

Farmer washed clothes at MRO Office: వైఎస్సార్సీపీ నాయకుడు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై తమ అధీనంలో ఉన్న భూమిని మరొకరికి హక్కు కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారని రైతు గంగులప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రెవెన్యూ పోలీసు శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు ఉతికి, అక్కడే ఆర పెట్టారు.

తమ అధీనంలోని భూమిపై మరొకరికి హక్కు కల్పించిన సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని, అప్పటివరకూ ఆందోళనను విరమించనంటూ భీష్మించుకు కూర్చున్నాడు. కాసేపటికి డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వర్ వచ్చి గంగులప్పకు నచ్చజెప్పి వెంటనే సర్వేయర్​ని గ్రామానికి పంపుతున్నట్లు తెలపడంతో రైతు ఆందోళన విరమించారు.

"నేను ఎమ్మెల్యే సర్​కి చెప్తా అన్నాను. ఎమ్మెల్యేకి కాకపోతే నీకు దిక్కున్న దగ్గర ఎవరికీ అయినా చెప్పుకో అని అన్నారు. 128 సర్వే నెంబర్​లో 12 ఎకరాల 15 సెంట్లు ఉంది. అందులో గవర్నమెంటుది ఎకరా 78 సెంట్లు ఉంది. దానిని మా పూర్వీకుల నుంచి నేను సాగుచేసుకుంటూ ఉన్నాను. దాని పక్కనే నా భూమి 75 సెంట్లు ఉంది. ఆ భూమిలో రాళ్లు వేసి ఆక్రమించుకున్నాను. నేను దీనిపై ఫిర్యాదు చేశాను. నా భూమి నాకు సర్వే చేసి ఇప్పించాలి". - గంగులప్ప, రైతు

బంగారం కోసం - కుమార్తె ఇంటి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.