Smoke in Sec-Guntur Intercity Express : సికింద్రాబాద్​-గుంటూర్​ ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​లో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు - తెలంగాణ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 13, 2023, 2:34 PM IST

Smoke in Sec-Guntur Intercity Express : సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​లో పొగలు వ్యాపించాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్​ వద్దకు రాగానే రైలు నుంచి దట్టమైన పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. అప్పటికే ట్రైన్​.. స్టేషన్​ వద్ద నిలిపి ఉంచడంతో భయంతో ట్రైన్​ నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే వచ్చి సమస్యను గుర్తించారు. ట్రైన్​లో పొగలు రావడానికి ప్రధాన కారణం బ్రేక్​​ వద్ద పైపులను తెలిపారు. వెంటనే వాటిని సరి చేసి ట్రైన్​కు గ్రీన్​ సిగ్నల్​​ ఇచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇటీవల జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో యాదాద్రి జిల్లాలో ఫలక్​నుమా ట్రైన్​ ప్రమాదంలో దాదాపు ఐదు బోగీలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తాజాగా జనగామ జిల్లాలో గుంటూర్​ ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​లో పొగలు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.