45 రోజుల తర్వాత రాకపోకలు తిరిగి ప్రారంభం - రాజమహేంద్రవరం-కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన పునఃప్రారంభం - తూర్పుగోదావరి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 5:02 PM IST
Rajamahendravaram Road Cum Rail Bridge Reopening: రాజమహేంద్రవరం-కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెనపై 45 రోజుల తర్వాత రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. మరమ్మతు పనుల కోసం సెప్టెంబర్ 27న వంతెనపై రాకపోకలు నిలిపేశారు. తొలుత నెల రోజులు మూసివేస్తున్నట్టు ప్రకటించినా.. మరమ్మతులు పూర్తి కాకపోవడంతో మరో 15 రోజులు పనులు చేశారు. తిరిగి ఈ ఉదయం వాహన రాకపోకలకు అనుమతించారు.
Road Cum Rail Bridge Reopening in AP: ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలతోపాటు కేవలం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల ప్రయాణానికి మాత్రమే అనుమతించారు. ఆర్టీసీ ఎక్స్ ప్రెస్, సూపర్ డీలక్స్, ఏసీ బస్సులను రోడ్డు కమ్ రైలు వంతెనపైకి అనుతించడం లేదు. దీంతో బస్సులు గోదావరి నాలుగో వంతెనపై నుంచే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వంతెనపై కేబుళ్లు బయటకు కనపడుతున్నాయి. కొవ్వూరు వైపు అప్రోచ్ రహదారి ఇంకా పూర్తి కావాల్సి ఉంది. గార్డ్ సోన్ట్స్ ఇంకా పూర్తిగా ఏర్పాటు చేయాలి.