ETV Bharat / health

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే గుండె జబ్బులు రావట! ఇన్ని లాభాలని తెలిస్తే రేపటి నుంచే స్టార్ట్ చేస్తారు! - DRINKING HOT WATER MORNING BENEFITS

-ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగితే చర్మంపై ముడతలు మాయం! -నిద్ర లేవగానే తాగితే గొంతు నొప్పి, సైనస్ సమస్యలకు చెక్

Drinking Hot Water at Morning Benefits
Drinking Hot Water at Morning Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Nov 16, 2024, 1:06 PM IST

Drinking Hot Water at Morning Benefits: మనలో చాలా మంది డే టైమ్ లోనే సరిగ్గా నీటిని తాగరు. ఇక ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు అంటారా..? నీటిని వేడిచేసుకునేంత టైమ్ లేదని మానేస్తారు. కానీ, ఉదయాన్నే కాస్త వేడి నీటిని తాగడం ద్వారా శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఇలా తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తీసుకోవడం వల్ల రక్తనాళాలు చురుగ్గా మారి శరీరమంతటా రక్త సరఫరా వేగవంతమవుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా వివిధ భాగాల పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో ఎంతో సహాయపడుతుందని The European Journal of Applied Physiologyలో ప్రచురితమైన ఓ అధ్యయనంలో తేలింది. Effects of Hot Water Immersion on Cardiovascular Function" అనే అంశంపై జపాన్, అమెరికాకు చెందిన వైద్యులు Jun Sugawara and Tsubasa Tomoto పాల్గొన్నారు.

గొంతు నొప్పి: చలికాలంలో ఎక్కువగా వేధించే సమస్య గొంతు నొప్పి. దీంతోపాట జలుబు కారణంగా కఫం, దగ్గు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే వేడి నీళ్లు సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణవ్యవస్థ మెరుగు: గోరు వెచ్చని నీళ్లు జీర్ణవ్యవస్థను శుభ్రపరిచేందుకు సాయపడతాయని నిపుణులు వివరించారు. చల్లటి నీళ్ల కంటే వేడి నీళ్లు ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తాయని తెలిపారు. ఇంకా వేడి నీళ్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయని.. ఫలితంగా జీర్ణప్రక్రియ ఆరోగ్యంగా మారి అధిక కేలరీలను ఖర్చు చేస్తాయని వివరించారు. ఇదే కాకుండా కడుపు నిండిన భావనను కలిగించి.. ఆహారం తీసుకునే మోతాదును తగ్గిస్తాయన్నారు.

సైనస్ సమస్యకు చెక్: కొందరికి ఉదయాన్నే ముక్కు పట్టేసినట్లుగా ఉండి.. ఊపిరి సరిగ్గా ఆడదు. అలాంటి వాళ్లు వేడి నీళ్లు తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు. సైనస్ సమస్య అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు.

నాడీ వ్యవస్థపైనా ప్రభావం: నాడీ వ్యవస్థపైనా గోరు వెచ్చని నీళ్లు ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నరాల పనిని వేగవంతం చేసి.. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్​ను అదుపులోకి తీసుకువస్తుందని వివరించారు.

చర్మంపై ముడతలు పోతాయట: ఇంకా ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయని వివరించారు. దీనినే డిటాక్సింగ్ అని పిలుస్తారు. ఇలా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లినప్పుడు చర్మ తాజాగా నిగారిస్తుందని తెలిపారు. చర్మం ముడతలు పడటాన్ని తగ్గిస్తుందని వివరించారు. వేడి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్రెడ్​గా ఉంచడానికీ తోడ్పడతాయని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కూర్చున్న సీట్​లో నుంచి లేవట్లేదా? గుండె, క్యాన్సర్, షుగర్ వ్యాధులు పక్కా వస్తాయట!

ఈ చిన్న పనిచేస్తే మీ ఆయుష్షు 11 ఏళ్లు పెరుగుతుందట! - పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.