ETV Bharat / state

ఏకంగా 15 ఎకరాల్లో గంజాయి సాగు - పోలీసులు ఏం చేశారంటే?

అటవీ భూమిలో అక్రమ గంజాయి సాగు గుర్తింపు - గంజాయి పంటను ధ్వంసం చేసి తగులబెట్టిన పోలీసులు

Police Found illegal Ganja Plantation in 15 acres
Police Found illegal Ganja Plantation in 15 acres (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Police Found illegal Ganja Plantation in 15 acres : అల్లూరి జిల్లాలో 15 ఎకరాలలో అక్రమ గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. అది కూడా అటవీ భూమిలో కావటం విశేషం. పెదబయలు మండలం జడిగూడలో సాగు చేస్తున్న గంజాయి పంటను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సూచనలతో రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో ధ్వంసం చేసి తగులబెట్టారు. నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి రవాణా, సాగుపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే సాయంతో ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచించారు.

డ్రోన్​లతో పసిగట్టిన పోలీసులు : కొద్దిరోజుల కిందటే జిల్లాలోని జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయిలో సుమారు 5 ఎకరాలలో గంజాయి సాగును డ్రోన్ సాయంతో గుర్తించి పోలీసులు ధ్వంసం చేశారు. దీనిపై ఎస్పీ అమిత్ బర్దర్ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, గతంలో డ్రోన్ సాయంతో వెతికినా చిన్న చిన్న ముక్కలు కావడం వల్ల కనపడలేదని రెండు అడుగుల పైబడి ప్రస్తుతానికి పెరగడంతో ఇప్పుడు డ్రోన్​కి కనిపించాయని చెప్పారు. ప్రభుత్వం తరఫున ప్రత్యామ్నాయ మొక్కల కోసం ఈ ప్రాంతంలో పంపిణీ చేశామని అయినా చెడుదారి పడుతున్నారని శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 25 రకాల పంట మొక్కల్ని సాగుచేసుకోవాలని సూచించారు. దాడుల్లో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులను దారి మళ్లిస్తున్న భయాలివే - కనిపెట్టుకోకుంటే కన్నీళ్లే!

దూకుడు పెంచిన అధికారులు : గంజాయి సాగు, అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించడంతోపాటు దాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితలు ప్రకటించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్​ను ఏర్పాటు చేస్తానని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని పోలీసు అధికారులు దూకుడు పెంచారు. రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పలువురిని జైళ్లకు పంపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం గంజాయి నిరోధానికి సంబంధించి విడుదల చేసిన టోల్‌ఫ్రీ నంబరుపై మన్యం వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కళాశాలలు, పాఠశాలలు, వారపుసంతల్లో గిరిజనులకు గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల తలెత్తే ఇబ్బందులపై చైతన్యం కల్గిస్తున్నారు.

'పుష్ప' తరహాలో గంజాయి తరలింపు - 912 కిలోలు స్వాధీనం - POLICE SEIZED GANJA

మత్తు కోరల్లో యువత జీవితం- తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే! - Increasing Drug Use In Nellore

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.