ETV Bharat / entertainment

ఒకే స్టేజీపై ఐశ్వర్య కుమార్తె, షారుక్‌ తనయుడి సందడి - పిల్లల పెర్ఫామెన్స్ చూసి మురిసిపోయిన స్టార్స్! - AISHWARYA RAI DAUGHTER PERFORMANCE

అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో సెలబ్రిటీ కిడ్స్ సందడి - పిల్లల పెర్ఫామెన్స్ చూసి మురిసిపోయిన స్టార్స్!

Aaradhya Abram Special Event
Aishwarya Rai Daughter Event (Associated Press, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2024, 1:34 PM IST

Aishwarya Rai Daughter Annual Day Performance : ముంబయిలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో గురువారం సాయంత్రం ఆ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. ఈ వేడుకలకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు షారుక్‌ ఖాన్‌ ఫ్యామిలీ, ఐశ్వర్య రాయ్‌ దంపతులు, సైఫ్‌ అలీఖాన్‌ దంపతలు హాజరై సందడి చేశారు. తమ పిల్లల పెర్ఫామెన్స్​లు చూసి మురిసిపోయారు.

ఆ ఇద్దరే స్పెషల్ అట్రాక్షన్
అయితే ఈ వేడుకలో చాలా మంది సెలబ్రిటీల పిల్లలు పెర్ఫామ్ చేయగా, అందరి దృష్టి మాత్రం ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య, షారుక్‌ ఖాన్‌ తనయుడు అబ్రంపై పడింది. ఈ ఇద్దరు కలిసి క్రిస్మస్​కు సంబంధించి ఓ స్టేజ్‌ షో చేశారు. ఆ సమయంలో కుమారుడిని చూసి షారుక్‌ పుత్రోత్సాహానికి లోనయ్యారు. అంతేకాకుండా అబ్రం పెర్ఫామెన్స్​ను కెమెరాలో బంధించారు. మరోవైపు ఐశ్వర్య - అభిషేక్‌ కూడా తమ కుమార్తె పెర్ఫామెన్స్​ను కెమెరాలో రికార్డు చేస్తూ మురిసిపోయారు. స్టేజీ కింద నుంచి ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

చాలా రోజులకు ఒకే ఈవెంట్​లో :
మరోవైపు చాలా రోజుల తర్వాత అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ ఒక ఈవెంట్‌లో కలిసి కనిపించారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ వేర్వేరుగానే పలు ఈవెంట్లకు హాజరవుతున్నారు. అంతేకాకుండా అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబసభ్యులందరూ ఏదైనా కార్యక్రమానికి హాజరైనా కూడా కలిసి మాత్రం ఫొటోలు దిగట్లేదు. ఇక అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీ అంతా ఒకసారి ఫొటోలు దిగుతుండగా, తన కుమార్తె ఆరాధ్యతో ఐశ్వర్యరాయ్‌ విడిగా కెమెరా ముందుకు వస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఫ్యాషన్‌ షోస్​ లేకుంటే మరేదైనా ఈవెంట్స్​ కూడా ఐశ్వర్యరాయ్‌ తన భర్తతో కాకుండా కుమార్తెతో వెళ్తున్నారు. ఈక్రమంలోనే ఎన్నో రూమర్స్​ కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఆ వార్తలను ఉద్దేశించి అమితాబ్‌ తాజాగా పరోక్షంగానే స్పందించారు. నిజానిజాలు తెలుసుకోకుండా కొంతమంది ఇటువంటి రూమర్స్ సృష్టిస్తుంటారని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన స్కూల్‌ ఈవెంట్‌లో ఈ ముగ్గురూ కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

విశ్వ సుందరి ఐష్​ గురించి ఈ విషయాలు తెలుసా?

షారుక్ ఖాన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?- ఇది మీ ఊహకు అస్సలు అందదు!

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.