ETV Bharat / sports

గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధపడ్డ మైన్ టైసన్‌ - కానీ! - MIKE TYSON VS GORILLA

గొరిల్లాతో ఫైట్​కు సిద్ధమైన మైక్ టైసన్- నో చెప్పిన జూ కీపర్!

Mike Tyson vs Gorilla
Mike Tyson vs Gorilla (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 17, 2024, 7:43 PM IST

Mike Tyson vs Gorilla : బాక్సింగ్‌ దిగ్గజం 58ఏళ్ల మైక్‌ టైసన్‌ యంగ్ ఏజ్​లో ఉన్నప్పుడు ఏకంగా ఓ భారీ గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని మైక్ టైసన్ 'ది ఇండిపెండెంట్‌' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. 1980ల్లో టైసన్‌ ఓసారి తన అప్పటి భార్య రాబిన్‌ గివెన్స్‌తో కలిసి న్యూయార్క్‌లోని జంతు ప్రదర్శనశాలకు వెళ్లాడు. అతడి కోసం జూ మేనేజ్​మెంట్ స్పెషల్ టైమింగ్స్​లో దానిని తెరిచారు. ఆ జూ లో ఒక పెద్ద సిల్వర్‌ బ్యాక్‌ గొరిల్లా, మిగిలిన వాటిని వేధించడాన్ని టైసన్‌ చూశాడు.

'చూడటానికి అది చాలా బలంగా ఉన్నా, కళ్లు మాత్రం చిన్న పిల్లల వలే ఉన్నాయి. దీంతో నేను దాంతో ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నా. జూ కీపర్‌ను పిలిచి 10వేల డాలర్లు ఇస్తా, నన్ను బోన్‌లోకి పంపించమని కోరాను. ఆ సిల్వర్‌ బ్యాక్‌ గొరిల్లాతో పోరాడి దాన్ని మట్టి కరిపిస్తానని చెప్పాను. కానీ, జూ కీపర్‌ అందుకు ఒప్పుకోలేదు' అని ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

క్రూర మృగాలతో చెలగాటమాడటం టైసన్‌కు కొత్త కాదు. గతంలో లాస్‌ వేగాస్‌లోని అతడి మాన్షన్‌లో రెండు పులులను పెంచుకున్నాడు. కానీ, ఆ తర్వాత రెండేళ్లకు అలాంటి జంతువులను పెంచుకోవడం అంత మంచిది కాదని ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. 'అది మూర్ఖపు నిర్ణయం. 100 శాతం పులులను పెంపుడు జంతువులుగా మార్చలేం. అది జరిగే పని కూడా కాదు. వాటితో సరదాగా గడిపే సమయంలో పొరపాటున అది మిమ్మల్ని చంపొచ్చు కూడా. ఒకసారి దాన్ని కొడితే అది తిరగబడే ప్రమాదం కూడా ఉంది. దీంతో మీ ప్రాణాలే పోవచ్చు' అని తెలిపాడు.

కాగా, మైక్ దాదాపు 19 ఏళ్ల తర్వాత రీసెంట్​గా ప్రొఫెషనల్‌ రింగ్‌లోకి అడుగు పెట్టాడు. ఈ మెగాఫైట్​లో 27ఏళ్ల యంగ్ ఫైటర్, యూ ట్యూబర్ జేక్ పాల్‌తో తలపడ్డాడు. అమెరికా AT&T స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​ను ప్రత్యక్షంగా 72,300 మంది, టీవీల్లో ఆరు కోట్ల మంది వీక్షించారు. పరోక్షంగా సుమారు 6కోట్ల మంది ఆన్​లైన్, టీవీల్లో చూశారు. వ్యూవర్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చేసిన నెట్​ఫ్లిక్స్​ కూడా కాసేపు నిలిచిపోయింది. ఇక ఈ పోటీలో ముగ్గురు జడ్జీల్లో ఒకరు 80-72 స్కోరుతో మరో ఇద్దరు 79- 73తో పాల్‌ను విజేతగా నిర్ణయించారు.

మెగా ఫైట్​పై మైక్ టైసన్ రియాక్షన్- ఇక్కడ ఓడినా, అక్కడ గెలిచాడట!

మెగా ఫైట్​ - దిగ్గజ బాక్సర్​ మైక్ టైసన్​ను ఓడించిన పాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.