ఒడిశాలో రైలుకు మంటలు.. బ్రేకులు సరిగా పడక.. - రైలు ఏసీ కోచ్ మంటలు
🎬 Watch Now: Feature Video
ఒడిశాలోని నౌపడా జిల్లాలోని ఖరియార్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద పూరీ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలులోని ఏసీ కోచ్‌లో గురువారం రాత్రి పది గంటల సమయంలో మంటలు వచ్చాయి. బ్రేక్ ప్యాడ్‌లో లోపం వల్ల మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. బీ3 కోచ్‌లో మంటలు గుర్తించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. బ్రేకులను పూర్తిగా వదిలేయకపోవడం వల్ల రాపిడి తలెత్తి మంటలు అంటుకున్నాయని వెల్లడించింది. బ్రేక్ ప్యాడ్ మినహా.. రైలుకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. కోచ్ లోపలకు మంటలు వ్యాపించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. మంటలు గుర్తించిన వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయని వివరించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత రైలు బయల్దేరిందని పేర్కొంది.
'18426 రైలు ఖరియార్ రోడ్ స్టేషన్‌కు గురువారం రాత్రి 10.07 గంటలకు వచ్చింది. అలారం చైన్ లాగిన తర్వాత బ్రేకులు రిలీజ్ కాలేదు. దీంతో బ్రేక్ ప్యాడ్లపై ఒత్తిడి పడి మంటలు తలెత్తాయి. కోచ్ లోపల ఎలాంటి మంటలు గుర్తించలేదు. బ్రేక్ ప్యాడ్లు మినహా రైలులో ఎలాంటి సమస్యలు లేవు. సమస్యను పరిష్కరించిన తర్వాత రైలు రాత్రి 11 గంటలకు స్టేషన్ నుంచి బయల్దేరింది' అని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వివరించారు.