సొంత జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీనే జగన్ ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు ?
🎬 Watch Now: Feature Video
Pratidwani Debate On Kadapa Steel Plant: టెంకాయల మీద టెంకాయలు కొట్టారు. జన్మనిచ్చిన జమ్మలమడుగు రుణం తీర్చుకుంటానని సీఎం హోదాలో తనే రెండు సార్లు శంకుస్థాపనలు చేసిన జగన్ హామీ ఏమైంది ? కడప ఉక్కు పరిశ్రమ ఎంతవరకు వచ్చింది ? ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి, సీమ రూపురేఖలు మార్చుతామన్న ఆశల ప్రాజెక్టు మీదే ఎందుకీ ఉదాసీనత ? కొద్ది రోజులుగా విపక్షాలు, ప్రజా సంఘాలు, రాయలసీమ ప్రాంత మేధావులు సంధిస్తున్న ప్రశ్నలు ఇవి. ఏళ్లు గడుస్తున్నా సీఎం జగన్ వేసిన శిలాఫలకాలు శిథిలావస్థకు చేరాయి. తన సొంత జిల్లాలో పరిశ్రమనే జగన్ ఎందుకు ముందుకు తీసుకు వెళ్లలేక పోతున్నారు ? ఇలాగైతే కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టేదెప్పటికి ? సొంత జిల్లాలో సీఎం జగన్ ఇప్పటికే నాలుగేళ్లలో రెండు సార్లు కడప స్టీల్ ఫ్యాక్టరీకీ శంకుస్థాపన చేశారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.