Deadbody in Rickshaw: 'అమ్మ'కెంత కష్టమొచ్చింది.. రిక్షాలో కుమారుడి మృతదేహం తరలింపు - పార్వతీపురం జిల్లా లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2023, 8:10 PM IST

poor mother carried her son deadbody in rickshaw: చేతికి అందొచ్చిన కుమారుడు మరణించినా కొండంత బాధను దిగమింగుతున్న ఆమెకు.. పేదరికం మరో పరీక్ష పెట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కుమారుడి మృతదేహాన్ని.. రిక్షాలో తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ హృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలో మరణించిన తన కుమారుడి మృతదేహాన్ని ఆ నిరుపేద తల్లి.. రిక్షాలో ఇంటికి తీసుకు వచ్చింది. జిల్లా కేంద్రంలోని సోని వైకేయం కాలనీకి చెందిన కిషోర్(26) అనే యువకుడు అనారోగ్యంతో హాస్పిటల్​లో​ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అతడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ లేకపోవటం, వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో.. అతడి తల్లి రిక్షాను ఆశ్రయించింది. కుమారుడి మృతదేహంతో ఆమె రిక్షాలో వెళ్తున్న దృశ్యం చూపరుల హృదయాలను కలిచివేసింది. ఈ క్రమంలో బంధువుల సహాయంతో ఆమె.. కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.