ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్ డంప్ లభ్యం.. ఏం ఉన్నాయంటే..? - latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 21, 2023, 7:45 PM IST

Maoist Dump at Andhra Odisha Border: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంప్​ను.. ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్ ఎస్పీ అభినవ్ సొంకర్.. సోమవారం నాడు జిల్లా పోలీస్ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాటి వివరాలను తెలిపారు. డంప్​ని ఏవోబీలో ఒనకడిల్లి సరిహద్దు ప్రాంతంలో.. మావోయిస్టులకు చెందిన డంప్ ఉన్నట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టి డంప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ డంప్​లో పేలుడుకు ఉపయోగించే 5 కట్టల కోడెక్స్ వైర్, అదేవిధంగా 100 డిటోనేటర్లు, 15 వాకీటాకీలు, 3 స్టీల్ కంటైనర్​లు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీలోని మావోయిస్టు నేతలు.. ఉదయ్, అరుణ, సురేష్​లు భద్రతా బలగాలే లక్ష్యంగా ఈ పేలుడు పదార్థాలను సేకరిస్తున్నారని పోలీసులు తెలిపారు. మల్కన్​గిరి, కోరాపుట్  జిల్లాల్లో ఘర్ వాపసి ఖోజ్​లో భాగంగా.. మావోయిస్టు డంప్​లను కనుగొంటున్నారు. సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేసి.. మారుమూల గ్రామాలకు రాకపోకలు సుగమం చేయడంపై ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు.  
 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.