Deceived Pastors పాస్టర్లనే మోసం చేశారు.. పదివేలు ఇస్తే, పదిలక్షలు చెల్లిస్తామన్నారు.. కోట్లు దండుకున్నారు - గుడ్ షెపర్డ్ సొసైటీ ద్వారా మోసపోయిన పాస్టర్లు
🎬 Watch Now: Feature Video
Deceived Pastors: పాస్టర్లను టార్గెట్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడతున్న గుడ్ షపర్డ్, ఆర్ఆర్ ఫౌండేషన్ నర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు సభ్యులు డిమాండ్ చేశారు. సీఎం జగన్ పేరు చెప్పుకుంటూ పేద పాస్టర్ల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారని ఎన్సీబీ జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్ బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అన్నారు. 10వేల రూపాయలు కడితే పది లక్షలు ఇస్తామని ఆశచూపారని ఆయన తెలిపారు. తమిళనాడులో ఐదు సెంట్ల స్థలం ఇప్పిస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పేరు చెప్పి అనేకమంది పాస్టర్లు, పేద క్రైస్తవులను మోసం చేసిన సదరు సంస్థ నిర్వాహకుల చేసిన కుంభకోణంపై డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి వెంటనే స్పందించి గుడ్ షపర్డ్ సంస్థ పై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.