TDP Leaders Complaint On YSRCP Leader Perni Nani : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కృష్ణా జిల్లా బందరు తాలుకా పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేర్ని నాని, అతని కుమారుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సరైన నివేదికలు ఇవ్వకుండా సివిల్ సప్లయిస్ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత 3708 బస్తాలు బియ్యం మాత్రమే షార్టేజ్ వచ్చిందని తేల్చి తూతూ మంత్రంగా క్రిమినల్ కేసు పెట్టారని మండిపడ్డారు.
మీడియా కథనాల ప్రకారం 7,577 బస్తాలు రేషన్ బియ్యం మాయమైతే దానిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదో, అధికారులను విచారించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గోడౌన్ నిర్మాణం కూడా అవినీతి సొమ్ముతో కట్టారని ధ్వజమెత్తారు. అగ్రిమెంట్ చేయించిన స్టాంప్ కాగితాలపై కూడా తమకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అల్లుకున్న ఆ స్నేహబంధం ఏమిటో! - చర్యలు తీసుకోవడంలో మౌనం ఎందుకో?
క్రిమినల్ కేసు నమోదు : పేర్ని నాని సతీమణి జయసుధ నిర్వహించే గోదాములో బియ్యం నిల్వలు తగ్గిన వ్యవహారంపై బందరు తాలూకా ఠాణాలో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ పేర్ని నాని, ఆయన కుమారుడికి పోలీసులు నోటీసు ఇచ్చారు. దీనిని సవాలు చేస్తూ సోమవారం వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ నోటీసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేయాలని కోరారు.
గోదాములో బియ్యం మాయం అయితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప గోదామును లీజుకు ఇచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం సరికాదని అన్నారు. రాజకీయ కారణాలతో తనకు పోలీసులు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. గోదామును పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చామని, బియ్యం మాయమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి సమాచారం కావాలో పోలీసులు నోటీసులో తెలపలేదని తెలిపారు. ఆ నోటీసును రద్దు చేయాలని కోరారు.
రేషన్ బియ్యం కేసులో నానికి మరోసారి నోటీసులు ఇస్తాం - కృష్ణా జిల్లా ఎస్పీ
బ్లాక్ లిస్టులోకి పేర్ని నాని గోడౌన్! - రేషన్ బియ్యం మచిలీపట్నం తరలింపు