ETV Bharat / state

విద్యుత్ అధికారుల ఫిర్యాదు - వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సహా 16మందిపై కేసు - CASES FILED ON YSRCP LEADERS

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితోపాటు మరో 16 మందిపై కేసు నమోదు

Cases_filed_on_YSRCP_Leaders
Cases filed on YSRCP Leaders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2024, 3:34 PM IST

CASES FILED ON YSRCP LEADERS: అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితోపాటు మరో 16 మంది వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసు స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా తమ కార్యాలయం వద్ద ఆందోళన చేసి తమ విధులకు ఆటంకం కలిగించారని విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహానంది తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితోపాటు మరో 16 మంది వైఎస్సార్సీపీ నాయకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ర్యాలీ కారణంగా పట్టణంలో రాకపోకలు స్తంభించడంతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారని టీడీపీ మండల కార్యదర్శి మోపిడి గోవిందు కూడా ఫిర్యాదు చేశారన్నారు.

కాగా విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. సబ్‌స్టేషన్ల వద్ద ప్లకార్డులతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు నిరసనలు తెలిపారు. ప్రజలపై భారం మోపడం కూటమి ప్రభుత్వానికి తగదని, కరెంటు ఛార్జీల భారం తగ్గించే వరకు పోరు కొనసాగుతుందంటూ ఆందోళనలు నిర్వహించారు. అయితే పలు నియోజకవర్గాల్లో ఆందోళనలకు అనుమతులు తీసుకోకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా ఉరవకొండలో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

విద్యుత్‌ ఛార్జీలపై వైఎస్సార్సీపీ పోరుబాట - రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.