ఒడిశా రైలు ప్రమాదం.. మృతదేహాలను పెట్టిన పాఠశాల కూల్చివేత.. అందుకేనా? - ఒడిశా బహనగా స్కూల్ కూల్చివేత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 9, 2023, 2:59 PM IST

Updated : Jun 9, 2023, 3:58 PM IST

Bahanaga School Demolition : ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భద్రపరిచిన బహనగా ప్రభుత్వ పాఠశాలను అధికారులు.. శుక్రవారం  కూల్చేశారు.తాత్కాలిక మార్చురీగా మార్చిన పాఠశాలలోకి పిల్లలు వెళ్లేందుకు భయపడతారని.. ఆ భవనాన్ని కూల్చి కొత్త పాఠశాల నిర్మించాలని స్థానికుల నుంచి బలమైన డిమాండ్లు వినిపించాయి. ఈ విషయాన్ని పాఠశాల నిర్వహణ కమిటీ.. జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లింది. 

ఈ నేపథ్యంలోనే బాలాసోర్‌ జిల్లా కలెక్టర్‌ దత్తాత్రేయ శిందే గురువారం స్కూల్‌కు వెళ్లి పరిశీలించారు. అనంతరం కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈ భవనాన్ని శుక్రవారం కూల్చివేశారు. ఈ ప్రదేశంలోనే మరో కొత్త భవనాన్ని నిర్మిస్తామని, అప్పుడు విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పాఠశాలకు వస్తారని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. బహనగా స్కూల్ 65 ఏళ్ల క్రితం నిర్మించింది. అందుకే ఆ పాఠశాల భవనం బాగా దెబ్బతింది. కాగా జూన్​ 2వ తేదీన ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది మరణించగా.. దాదాపు 1,200 మందికి పైగా గాయపడ్డారు. 

Last Updated : Jun 9, 2023, 3:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.