Nara Lokesh Brahmani tweets on Skill Development Case లోకేశ్, బ్రాహ్మణిల తాజా ట్వీట్.. స్కిల్ కేసులో వైసీపీ నేతలు నిజాన్ని చూడలేని కబోదులు - Former Siemens MD Suman Bose

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 10:56 AM IST

Skill Development Case Nara Lokesh Brahmani tweets: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి అంటూ రెండున్నరేళ్లుగా ఒక్క ఆధారం లేకుండా సీమెన్స్ సంస్థపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. 'సీమెన్స్ ఆధ్వర్యంలో వందల మంది భాగస్వాములుగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విజయవంతమైందని స్పష్టం చేశారు. షెల్ కంపెనీ (Shell Company) ముద్ర వేస్తున్న వారికి అసలు దాని అర్థం తెలుసా? అని నిలదీశారు. తప్పుడు ఆరోపణలతో లక్షల కుటుంబాలను, శిక్షణ పొందిన విద్యార్థుల్ని క్షోభ పెడుతున్నారని లోకేశ్(Lokesh) మండిపడ్డారు. ప్రాజెక్టు గురించి సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ నిర్వహించిన విలేకరుల సమావేశం వీడియోను ట్వీటు జత చేశారు.

వ్యవస్థలను అపహాస్యం చేయొద్దని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం వైసీపీ (YCP)తగదని నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి హితవు పలికారు. వైసీపీ నాయకులు పాలనలో అసమర్థులు మాత్రమే కాదనీ... నిజాన్ని కూడా చూడలేని కబోదులంటూ ధ్వజమెత్తారు. వైసీపీకి వ్యాపార సూత్రాలు బోధిస్తూ సిమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారని ట్వీట్ చేశారు. ఉపాధి అవకాశాలు కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని బ్రాహ్మణి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.