కలెక్టర్ సారూ మేము చదవలేకపోతున్నాం, వసతులు కల్పించండి - ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆందోళన - మడమనూరు ప్రాథమిక పాఠశాల
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 10:28 PM IST
Madamanuru Govt School Students Suffering: వారంతా అయిదో తరగతి లేదా అంతకంటే తక్కుత తరగతి చదువుతున్న పిల్లలు. చదువు, ఆటపాటలతో సరదాగా గడపాల్సిన వారంతా తమ స్కూల్ కోసం ఏకమయ్యారు. తమ గోడు పట్టించుకోండి సారూ అంటూ రోడ్డెక్కి తమ నిరసనను తెలిపారు. స్కూల్లో చదువుకోవాల్సిన వారు.. పాఠశాల అపరిశుభ్రంగా ఉండటం వలన తాము చదవలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సారూ మా స్కూల్‌కి కనీస వసతులు కల్పించండి అంటూ వేడుకున్నారు.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో ప్రాథమిక పాఠశాల ఆవరణ అపరిశుభ్రతగా మారింది. చిన్నారులు భోజనం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణలే ఈ సమస్యకు కారణం అంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. రోడ్డుపై కూర్చుని తమ పాఠశాలకు వసతులు కల్పించాలంటూ కోరారు. చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడంతో కొంత మంది వ్యక్తులు ఆక్రమణకు పాల్పడుతున్నారని తెలిపారు. పందులు, కుక్కలు పాఠశాలలో నివాసం ఉంటున్నాయని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.