సీరియల్ షూటింగ్లో మళ్లీ చిరుత కలకలం.. పది రోజుల్లో నాలుగోసారి! - Leopard In Goregaon film city
🎬 Watch Now: Feature Video
Leopard In Goregaon East Mumbai : ముంబయిలోని తూర్పు గోరేగావ్‌లో ఉన్న ఫిల్మ్‌సిటీలో మళ్లీ చిరుత కలకలం సృష్టించింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో మరాఠీ టీవీ సీరియల్ సెట్లోకి తన పిల్లతో సహా ప్రవేశించింది. చిరుత వచ్చిన సమయంలో సెట్‌లో దాదాపు 200 మంది ఉన్నారు. ఈ ఘటనపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. " సీరియల్ సెట్‌లో 200 మందికి పైగా ఉన్నారు. ఇలాంటి ఘటన వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోవచ్చు. గత 10 రోజుల్లో దాదాపు ఇది నాలుగో ఘటన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవడం లేదు." అని అసహనం వెలిబుచ్చారు.
Goregaon Leopard Attack : అయితే ఇటీవల జులై 16న రాత్రి సమయంలో టీవీ సీరియల్ సెట్లోకి చిరుత ప్రవేశించింది. అనంతరం ఓ కుక్కపై దాడి చేసి చంపేసింది. అప్పుడు కూడా షూటింగ్ సెట్‌లో దాదాపు 200 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అయితే, ఆహారం వెతుక్కూంటూ చిరుత ఫిల్మ్‌సిటీలోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.