స్కూటీపై రాహుల్​ షికార్​.. డెలివరీ బాయ్​తో కలిసి 2కి.మీ జర్నీ - రాహుల్​ గాంధీ ఎన్నికల ప్రచారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2023, 4:04 PM IST

కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ.. ఓ డెలివరీ బాయ్​ స్కూటీపై ప్రయాణించి సందడి చేశారు. సుమారు రెండు కిలోమీటర్లు అతడితోపాటు రాహుల్​ వెళ్లారు. ఆయన వెనుక సెక్యూరిటీ గార్డులు పరుగులు తీశారు. డెలివరీ బాయ్​తో స్థానికంగా ఉన్న హోటల్​కు చేరుకున్న రాహుల్​ను చూసి చుట్టు పక్క ప్రజలు గుమిగూడారు. కార్యకర్తలు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. తమ పార్టీను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన రాహుల్​.. అక్కడే ఉన్న చిన్నారులతో ముచ్చటించారు. కాసేపు సరదాగా గడిపారు.

మరోవైపు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం చివర దశకు చేరుకుంది. దీంతో అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాలు కాంగ్రెస్​, జేడీఎస్​ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. వరుస రోడ్​షోలతో బిజీబిజీగా గడుపుతున్నారు. శనివారం 26 కిలోమీటర్ల మెగా రోడ్ ​షో చేపట్టిన మోదీ.. ఆదివారం 8 కిలోమీటర్ల మేర మరో రోడ్ ​షో నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్​ షో 11.30 గంటలకు ముగిసింది. బెంగళూరు సెంట్రల్​ లోక్​సభ నియోజకవర్గంలోని కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్​ వరకు సాగింది. 

కన్నడ ఓటర్లపై ప్రధాన పార్టీలు ఉచిత హామీల వర్షం కురిపించాయి. తమ మేనిఫెస్టోల్లో ప్రముఖంగా ఉచిత హామీల గురించే ప్రస్తావించాయి. 'ఫ్రీ' ప్రకటనల్లో కాంగ్రెస్, జేడీఎస్​లు ముందున్నాయి. బీజేపీ సైతం తమ విధానాలకు భిన్నంగా ఉచిత వాగ్దానాలు చేసింది. ఇంతకీ.. ఎవరి మేనిఫెస్టోలో ఏముందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.