మార్కెట్​లో భారీ అగ్ని ప్రమాదం.. 500 వస్త్ర దుకాణాలు దగ్ధం.. రూ.కోట్లు నష్టం - బన్స్​మండిలో అగ్ని ప్రమాదం కాన్పుర్ ఉత్తర్​ప్రదేశ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2023, 10:57 AM IST

Updated : Mar 31, 2023, 11:33 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కాన్పుర్​ నగంలోని అన్వర్​గంజ్​ పోలీస్​స్టేషన్​ పరిధి బన్స్​మండిలో ఉన్న క్లాత్​ మార్కెట్​లో గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 500 దుకాణాలు దగ్ధమయ్యాయి. దుస్తులు, ఇతర వస్తువులు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈద్​ సీజన్​ సందర్భాంగా నిల్వ ఉంచిన స్టాక్​ మొత్తం కాలిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మార్కెట్​లోని ఏఆర్​ టవర్​లో మంటలు చెలరేగాయి. దుస్తులు, కార్డ్​బోర్ట్​, పేపర్​ లాంటి మండే స్వభావమున్న వస్తువులు ఉండటం వల్ల.. మంటలు కొద్దిసేపటికే భారీగా వ్యాపించాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సబ్బంది, పోలీసులకు సమాచారం అందిచారు. అయితే పోలీసులు వచ్చేసరికే దాదాపు 100కు పైగా దుకాణాలు కాలిపోయాయి. గాలి వేగం పెరగడం వల్ల.. ఆ తర్వాత కూడా మంటలు చెలరేగాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రూ. కోట్ల నష్టం వాటిల్లింది. కాగా, శుక్రవారం ఉదయం వరకు మంటలు అదుపుచేయలేకపోయారు. ట్రాన్స్​ఫార్మర్​ షార్ట్​ సర్క్యూట్​ కావడం వల్ల.. మంటలు వ్యాపించాయని ఉత్తర్​ప్రదేశ్​ గార్మెంట్స్​ తయారీదారులు, వ్యాపారుల సంఘం ప్రాంతీయ ప్రధాన కార్యదర్శ గుర్జీందర్​ సింగ్​ తెలిపారు. మరోవైపు, వ్యాపారులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

Last Updated : Mar 31, 2023, 11:33 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.