Janasena Leaders Meeting with AP Governor Abdul Nazeer: గవర్నర్‌ను కలిసిన జనసేన నేతలు.. వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు - పవన్ అరెస్ట్ పై జనసేన నేతలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2023, 9:25 PM IST
|Updated : Sep 11, 2023, 9:41 PM IST
Janasena Leaders Meeting with AP Governor Abdul Nazeer: వైసీపీ నేతలు చేస్తోన్న భూ ఆక్రమణలపై విశాఖ జనసేన నేతలు పీతల మూర్తియాదవ్ నేతృత్వంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విశాఖలోని పోర్టు గెస్ట్‌హౌస్‌లో జనసేన బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను(Governor Abdul Nazeer) కలిశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న తీరును జనసేన నేతలు గవర్నర్‌కు వివరించారు. అలాగే... విశాఖలో వైసీపీ నేతల భూ ఆక్రమణలపై జనసేన నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విన్నవించుకున్నారు. (Janasena Leaders) గవర్నర్‌ను కలిసినవారిలో పీవీఎస్‌ఎన్ రాజు, పంచకర్ల సందీప్, ఉషాకిరణ్, తదితర నేతలు ఉన్నారు.
Janasena Leaders Complaint to Governor on YCP Anarchy: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని(Andhra University) కాంక్రీట్ జంగల్‌గా మార్చారని జనసేన నేతలు ఆరోపించారు. వైసీపీ(YCP_ అక్రమాలకు సహకరిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు మూర్తియాదవ్ తెలిపారు. పరిపాలన రాజధాని పేరుతో విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తనఖాపెట్టి దోచుకుంటున్నారని ఆరోపించారు. పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ చేస్తున్న అరాచకాలపై విచారణ చేపట్టాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మూర్తియాదవ్ కోరారు. జనసేన అధినేతను అడ్డుకోవడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మూర్తియాదవ్ పేర్కొన్నారు. పవన్ సూచన మేరకే గవర్నర్‌ను కలిసినట్లు వెల్లడించారు.