ETV Bharat / state

పేలిన శానిటైజర్​ బాటిల్​ - ముగ్గురికి తీవ్ర గాయాలు - EXPLODED SANITIZER BOTTLE

క్రిస్మస్​ సందర్భంగా ఇళ్లు శుభ్రం చేసే క్రమంలో దొరికిన శానిటైజర్​ - దానిని తెరిచే క్రమంలో ఒక్కసారిగా పేలిన ఐదు లీటర్ల డబ్బా - ముగ్గురికి తీవ్ర గాయాలు

NARAYANPET SANITIZER ISSUE
SANITIZER EXPLODED (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

Sanitizer bottle exploded and three were seriously injured : కరోనా సమయంలో ప్రాణాలు కాపాడుతుందని తెచ్చిన శానిటైజర్​ సీసానే ముగ్గురిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఇంకా చెప్పాలంటే ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేసింది. శానిటైజర్ల వాడకంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. వీటిని మరీ అతిగా, అనవసరంగా వాడకపోవటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సబ్బుతో చేతులను కడుక్కునే అవకాశం లేనప్పుడు మాత్రమే శానిటైజర్లను వాడుకోవాలని సూచిస్తున్నారు. ఎంత మంచివైనా క్వాలిటీవైనా కూడా వీటితో కొన్ని దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉందన్న సంగతి మరవరాదు.

పేలిన ఐదు లీటర్ల శానిటైజర్ డబ్బా : నారాయణపేట జిల్లాలోని మద్దూరులో ఓ ఇంట్లో వ్యాలిడిటీ పూర్తయిన శానిటైజర్‌ సీసా పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఇల్లును శుభ్రపరచడానికి మంగళవారం(డిసెంబరు 24) నాడు మ్యాతరి భాస్కర్‌ అనే వ్యక్తి సిద్ధమయ్యారు. చాలాకాలం క్రితం తెచ్చి ఉంచిన శానిటైజర్​తో చేతులు శుభ్రపరచుకునేందుకు ప్రయత్నించారు. కానీ శానిటైజర్‌ డబ్బా మూత తెరిచే క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది.

శరీర భాగాలపై తీవ్ర గాయాలు : ఆ కెమికల్​ వాటర్​ అంతా భాస్కర్​ శరీరం, ముఖం, తల, చేతులపై పడటంతో మొత్తంగా తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఇద్దరికై కూడా ద్రావణం పడటంతో వారికీ అక్కడక్కడా గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన నారాయణపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాస్కర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మద్దూరు సబ్​ ఇన్స్​పెక్టర్​ రాంలాల్‌ తెలిపారు.

కరోనా జబ్బు ప్రజలందరికీ పాత పాఠాన్ని కొత్తగా నేర్పింది. అందరికీ తెలిసిందే అయినా తేలికగా తీసుకోకుండా కచ్చితంగా ఆచరించేలా చేసింది. అదే చేతులు ఇప్పుడెవరిని తాకిన శానిటైజర్‌ రాసుకోవటమే పనిగా పెట్టుకుంటున్నారు కొంతమంది. అప్పట్లో కరోనా వైరస్‌ బారినపడకుండా ఉండటానికిది కాస్తా తోడ్పాటును అందించింది. కానీ అతిగా వాడితే దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలూ ఉన్నాయి.

చేతులకు శానిటైజర్‌ రాసుకోవటం ప్రస్తుతం నిత్య కృత్యంగా మారిపోయింది. బయటకు వెళ్లినప్పుడే కాకుండా, ఇంట్లో కూడ వీటిని వాడుతున్న వారూ ఉన్నారు. ఇది మంచి పద్దతే కాకపోతే జబ్బులు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవటమే ఉత్తమమైన మార్గం. ఇది అన్నింటికన్నీ సులభమైంది. అలాగని అన్నిసార్లూ సబ్బుతో కడుక్కోవటం అనేది సాధ్యం కాకపోవచ్చు.

అలర్ట్​: శానిటైజర్​ డైలీ వాడుతున్నారా? - ఏకంగా మెదడుకే ముప్పు! - Side Effects of Using Sanitizer

విద్యార్థినుల మధ్య ఘర్షణ.. శానిటైజర్​ తాగి ఐదుగురి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.