thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 9:17 PM IST

ETV Bharat / Videos

'ఏయూ తొలి దళిత మహిళా వీసీకి అవమానం - ఆ ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'

Janasena Corporator Murthy Yadav Fire on AU Former VC, Registrar: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొలి దళిత మహిళా వీసీని అవమానించిన మాజీ వీసీపై చర్యలు తీసుకోవడంతో పాటుగా, ఏయూ రిజిస్ట్రార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సౌత్‌ జోన్ వర్సిటీల యూత్ ఫెస్టివల్‌కు వీసీని పిలవకుండా అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన మాజీ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌ను వెంటనే తొలగించి, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పీతల మూర్తి యాదవ్‌ డిమాండ్ చేశారు.

Murthy Yadav Comments: ''ఆంధ్రా విశ్వవిద్యాలయం తొలి దళిత మహిళా వీసీ అయినా సమతకు తీవ్ర అవమానం జరిగింది. విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్ జోన్ విశ్వవిద్యాలయాల యూత్ ఫెస్టివల్‌కు ఆమెను పిలవకుండా వేడుకలు ప్రారంభించారు. ఇందుకు బాధ్యులైన మాజీ వీసీ ప్రసాద్‌రెడ్డి, ఆయన నియమించిన రిజస్ట్రార్ స్టీఫెన్‌లను వెంటనే విధుల నుంచి తొలగించాలి. అంతేకాదు, వారిద్దరిపై ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలి. వర్సిటీ వీసీగా సమత నియామకం జరిగినప్పటీ నుంచి మాజీ వీసీ ప్రసాద్‌రెడ్డి వైఎస్సార్సీపీ అండదండలతో ఆమెను పట్టించుకోవడం మానేశారు. వీసీగా తిరిగి వస్తానంటూ ప్రచారం చేసుకుంటూ ఆమెను  వేధించడం ప్రారంభించారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి వారిద్దరిపై చర్యలు తీసుకోవాలి.'' అని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.