బాబోయ్ పులి పిల్లలు - పులివెందుల నియోజకవర్గంలో హడల్ - A TIGER CUB IN YSR DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2024, 2:42 PM IST
Tiger Cub In Kadapa District: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని చేలల్లో పులి పిల్ల సంచరిస్తూ ఓ రైతుకు కంటబడింది. అంతే కాకుండా మడుగు చేను దగ్గర సైతం పులి పిల్ల కనిపించినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వారు హుటాహుటిన వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి పిల్ల సంచరిస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లింగాల మండలం ఎంఆర్వో గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.
''పత్తిచేనులో పెద్దపులి" - తాళ్లు తెంపుకుని ఊళ్లోకి పరిగెత్తిన ఎద్దులు
ఇటీవల వరుసగా పొల్లాలో పులులు రైతులపై దాడుల నేపథ్యంలో ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న పులులు మనుషులు ప్రాణాలను హరించి వేస్తుండటంతో ప్రజలు జంకుతున్నారు. రక్షణ పద్ధతులను పాటించి పులుల దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని అటవీ అధికారులు చెబుతున్నారు.
పులిని పరిగెత్తించిన మహిళ - భర్తను కాపాడుకోవడానికి ధైర్యసాహసాలు