OnePlus 13 Smartphone Launch: ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'OnePlus 13'ను మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతోంది. దీని ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్ 'iQOO 13' నిన్ననే భారత మార్కెట్లో లాంఛ్ అయింది. ఈ క్రమంలో 'OnePlus 13' మొబైల్ కూడా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇది 'iQOO 13' ఫోన్‌కు గట్టి పోటీని ఇవ్వగలదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల గురించి ఇప్పటికే కొంత సమాచారం రివీల్ అయింది. అదేంటో తెలుసుకుందాం రండి.
'OnePlus 13' లాంఛ్ డేట్..?: ఈ 'OnePlus 13' మొబైల్ ఇటీవలే అక్టోబర్ 2024లో చైనాలో లాంఛ్ అయింది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో చైనీస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కంపెనీ ఈ మొబైల్‌ను జనవరి 2025లో గ్లోబల్‌గా లాంఛ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గ్లోబల్ మార్కెట్లో కంపెనీ 'R' సిరీస్ స్మార్ట్‌ఫోన్ 'OnePlus 13R'తో పాటు రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ 'OnePlus 13R' మొబైల్ చైనాలో 'OnePlus Ace 5' పేరుతో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.
'OnePlus 13' ఫీచర్లు:
- డిస్‌ప్లే: క్వాడ్-కవర్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.82-అంగుళాల AMOLED
- రిజల్యూషన్: 3168x1440
- రిఫ్రెష్ రేట్: 120Hz
- బ్రైట్నెస్: 4,500 nits
- డాల్బీ విజన్ HDR
- అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- ర్యామ్: 24GB LPDDR5X వరకు
- స్టోరేజీ: గరిష్టంగా 1TB UFS 4.0
- వెనుక కెమెరా: OISతో 50MP ప్రైమరీ (Sony LYT 808), 50MP అల్ట్రా-వైడ్, 50MP టెలిఫోటో (3x జూమ్, OIS)
- ఫ్రంట్ కెమెరా: 32MP
- బ్యాటరీ: 6,000mAh
- ఛార్జింగ్: 100W వైర్డు, 50W వైర్‌లెస్
- ప్రొటెక్షన్: IP68, IP69
- బరువు: 210 గ్రాములు
కెమెరా సెటప్: ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో 50MP సోనీ LYT 808 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ సెన్సార్ వంటివి ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీ కోసం ఇందులో 32MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించొచ్చు.
OnePlus 13 will launch globally in January 2025! pic.twitter.com/D8KeAK36pD
— OnePlus Club (@OnePlusClub) December 2, 2024
ధర: ఇండియాలో ప్రీమియం 'OnePlus 13' ధర రూ. 70,000లోపు ఉండొచ్చు. 'OnePlus 13' ఈ ధర ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లోని ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడేలా చేస్తుంది. ఇక కంపెనీ ప్రీవియస్ మోడల్ 'OnePlus 12' ధరను పరిశీలిస్తే భారత మార్కెట్లో దీని ధర రూ. 64,999గా ఉంది.
ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్‌డౌన్ స్టార్ట్..!
ఓలా ఎలక్ట్రిక్ యూజర్లకు గుడ్‌న్యూస్- ఒకేసారి ఏకంగా 3200 స్టోర్లు.. ఇక సర్వీసులకు తగ్గేదేలే..!
ఎన్నో రహస్యాలు.. ఛేదించే పనిలో 'ప్రోబా-3'.. ఇది కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఎలా సృష్టిస్తుందో తెలుసా?