PV Ramesh on Skill Development Case: నేను అప్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తవం- పీవీ రమేష్ - Political situation in

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 12:58 PM IST

Updated : Sep 11, 2023, 8:42 PM IST

PV Ramesh Comments on Skill Development Institute: యువతకు మేలు చేసేందుకే నైపుణ్యాభివృద్ధి సంస్థ (Skill Development Institute) ఏర్పాటు చేసినట్లు ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి పీవీ రమేష్ (PV Ramesh) స్పష్టం చేశారు. చట్టపరమైన విధానాలు పాటించే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని కేబినెట్‌, చట్టసభ అనుమతితోనే వనరులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిర్ణయం తీసుకున్న నాటి సీఎం చంద్రబాబు మీద కేసు (Case Against Chandrababu) పెట్టడం దారుణమన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారన్న ఆయన సీఐడీ (CID) మొదట పోయిన నోట్‌ఫైల్స్‌ మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. తాను అప్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తవన్నారు. సీఎంగా ఉండేవారు అనేక అంశాలను పర్యవేక్షిస్తారు. వాటికి సంబంధించిన శాఖల అధికారులే ప్రధాన బాధ్యత వహించాలి. ఆనాడు విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్‌ ఏమయ్యాయి? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫైల్స్‌ పరిశీలిస్తే అన్నీ స్పష్టంగా అర్థమవుతాయని అన్నారు. తన వాంగ్మూలం ఆధారంగానే మాజీ సీఎంను అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదమంటున్న ఆర్థికశాఖ ఉన్నతాధికారి పీవీ రమేశ్‌తో ముఖాముఖి.

Last Updated : Sep 11, 2023, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.