thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 1:37 PM IST

ETV Bharat / Videos

బెడవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సినీనటి హన్సిక

Heroin Hansika Kanakadurga Temple Visit in Indrakiladri : విజయవాడ  ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను సినీనటి హన్సిక దర్శించుకున్నారు. ఈనెల 17వ తేదీన "మై నేమ్ ఈజ్ శ్రుతి"  పేరిట కొత్త చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్లు హన్సిక తెలిపారు. ఈ సందర్భంగా హన్సిక మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్, ఇతర యూనిట్‌ సభ్యులతో గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పండితులు వేద ఆశీర్వచనం చేశారు.

 Heroin Hansika in Vijayawada Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి గాజుల అలంకరణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తీకమాసం విదియ రోజున లక్షల గాజులతో అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని పండితులు తెలిపారు. దీనిలో భాగంగా అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శినమిస్తున్నారు. దసరా నవరాత్రుల తర్వాత రెండు సమయాల్లో దుర్గమ్మకు విశేష అలంకరణాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపింది. అలాగే ఆషాడ మాసంలో వివిధ రకాల కాయగూరలతో శాకంబరీ ఉత్సవాలప్పుడు అమ్మవారి శాకములతో దర్శనమిస్తారు. గాజుల ఉత్సవంలో భాగంగా ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనానికి సర్వదర్శనంలో భక్తులను అనుమతిస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.