Mike Tyson VS Jake Paul : 58 ఏళ్ల దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌కు ఓటమి ఎదురైంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్‌లోకి అడుగు పెట్టిన మైక్ టైసన్‌ను యూ ట్యూబర్ జేక్ పాల్ ఓడించాడు. వాస్తవానికి మైక్ టైసన్ చాలా ఏళ్ల తర్వాత రింగ్‌లోకి అడుగుపెట్టడంతో మునుపటి ఉత్సాహాన్ని చివరి వరకూ ప్రదర్శించలేకపోయాడు. ఈ పోరులో యూ ట్యూబర్ జేక్ పాల్, మైక్ టైసన్‌ను 74-78 తేడాతో పరాజయం రుచి చూపించాడు.
అయితే ఈ బౌట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే పాల్‌ను చెంప దెబ్బ కొట్టి, పోరుపై మంచి ఆసక్తి కలిగించాడు మైక్ టైసన్. అందుకు తగ్గట్టుగానే తొలి రెండు రౌండ్లలో మైక్ టైసన్ ఆధిపత్యం చూపించాడు. కానీ, ఆ పట్టును చివరి వరకు కొనసాగించ లేకపోయాడు. దీంతో మూడో రౌండ్ నుంచి యువ యూట్యూబర్ జేక్ పాల్ (27 ఏళ్లు) పుంజుకుని ఆడాడు. గేమ్‌లో వెనుదిరిగి చూడకుండా ఆధిపత్యం ప్రదర్శించాడు.
కాగా, మైక్ టైసన్ - జేక్ పాల్ మధ్య 8 రౌండ్లను నిర్వహించారు. ఇందులో పాల్ ఆరు రౌండ్లలో గెలుపొందగా, మైక్ టైసన్ మాత్రం రెండు విజయాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో 10-9, 10-9, 9-10, 9-10, 9-10, 9-10, 9-10, 9-10 తేడాతో పాల్ విక్టరీని అందుకున్నాడు. ఇక బౌట్ జరిగిన అనంతరం మైక్ టైసన్ - యూట్యూబర్ పాల్ మామూలుగానే అభివాదం చేసుకోవడం విశేషం.
మైక్ టైసన్ చివరి సారిగా 2005లో కెవిన్ చేతిలో ఓటమి చెందాడు. అప్పుడు నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే ఇప్పుడీ తాజా బౌట్‌లో పోటీ పడటం కోసం టైసన్ సుమారు రూ.168 కోట్లు, పాల్ దాదాపు రూ.337 కోట్లు తీసుకోబోతున్నట్లు తెలిసింది.
బాక్సింగ్ మ్యాచ్ ఎక్కడ చూడవచ్చు? - మైక్ టైసన్ vs జేక్ పాల్ బాక్సింగ్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ఇచ్చారు. అయితే ఇది చూడాలంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఉచితంగా చూడటం కుదరదు.
మైక్ టైసన్ VS జేక్ పాల్ మెగా ఫైట్‌కు వేళాయే - భారత్‌లో ఎక్కడ, ఎప్పుడు లైవ్ చూడొచ్చంటే?
అత్యధిక సిక్స్‌లు, విదేశీ గడ్డపై అత్యుత్తమ స్కోర్ - సఫారీలపై విజయంతో భారత్ ఖాతాలో 7 రికార్డులు