ETV Bharat / offbeat

సిరి ధాన్యాలు తినలేకపోతున్నారా? - ఇలా "వడలు" చేసుకుంటే మొత్తం లాగిస్తారు! - SAJJA VADALU IN TELUGU

- రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం

Sajja Vadalu
How to Make Sajja Vadalu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 12:04 PM IST

How to Make Sajja Vadalu : సిరి ధాన్యాలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతుంటారు. కానీ.. వాటిని తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లు సిరి ధాన్యాలతో తీయని వడలు ఇలా తయారు చేసుకోండి. మిలెట్స్​తో "తీయని వడలా" ఎలా అని ఆలోచిస్తున్నారా? సజ్జలతో అండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా సజ్జలతో వడలు చేసుకుంటే.. ఎంతో రుచికరంగా వస్తాయి. మరి, ఇక ఆలస్యం ఎందుకు? కమ్మని సజ్జ వడలు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • సజ్జలు- కేజీ
  • బెల్లం-అరకేజీ
  • యాలకులు-20
  • ఎండుకొబ్బరి -1
  • నీరు -సరిపడా
  • నూనె-సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా సజ్జలను శుభ్రంగా నీటిలో కడగాలి. తర్వాత వాటిని పొడి వస్త్రంపై వేయాలి. పూర్తిగా ఆరనివ్వాలి.
  • ఇప్పుడు సజ్జలను మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. గ్రైండ్​ చేసిన మొత్తం సజ్జ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు ఎండుకొబ్బరిని చిన్నముక్కలుగా కట్​ చేసుకోవాలి. ఆపై మిక్సీ గిన్నెలో కొబ్బరి ముక్కలు, యాలకులు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
  • కొబ్బరి పొడిని సజ్జ పిండిలో వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
  • ఆ తర్వాత స్టౌపై కడాయి పెట్టి బెల్లం వేసి, గ్లాసు నీరు పోయండి. బెల్లం కరిగిన తర్వాత పాకం పూర్తిగా చల్లారనివ్వండి.
  • ఆపై పాకం జాలి గరిటె సహాయంతో సజ్జ పిండిలో పోసుకుని కలుపుకోండి.
  • వడలు చేయడం కోసం పిండిలో అవసరమైనంత నీరు పోసుకుంటూ.. పిండిని పూర్తిగా కలుపుకోవాలి. (వడల కోసం పిండి మరీ గట్టిగా కాకుండా.. పల్చగా లేకుండా ఉండాలి.)
  • ఇప్పుడు స్టౌపై వడలు ఫ్రై చేయడం కోసం ముకుడు పెట్టండి.
  • ఇందులో సరిపడా ఆయిల్​ పోసి వేడి చేయండి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని వడలు చేసుకోండి.
  • వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేయండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి వడలను బ్రౌన్​ కలర్లో వేయించి ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఇలా మిగిలిన పిండితో వడలు చేసుకుంటే సరిపోతుంది.
  • ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి తినడం ద్వారా రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
  • నచ్చితే మీరు కూడా ఇలా హెల్దీగా వడలను ఓ సారి ట్రై చేయండి.

"మసాలా వడ" అద్దిరిపోయే స్నాక్ - ఇలా చేస్తే సూపర్ క్రిస్పీగా వస్తుంది!

ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.