Maharashtra Portfolio Allocation : మహారాష్ట్రలో మంత్రులకు శాఖలను కేటాయించింది కొత్తగా కొలువుదీరిన మహాయుతి ప్రభుత్వం. కీలకమైన హోం శాఖను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా సాధారణ పరిపాలన, విద్యుత్, న్యాయ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ శాఖలు కూడా ఫడణవీస్ అధీనంలోనే ఉండనున్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేకు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, ప్రజా పనుల (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్) శాఖల బాధ్యలను అప్పగించారు. మరో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్థికశాఖ, ఎక్సైజ్ శాఖలను అప్పగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్ భవంకులే రెవెన్యూశాఖ అప్పజెప్పారు. ఈ మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
మరికొన్ని ముఖ్యమైన పోర్టుఫోలియోలు :
- రాధాకృష్ణ- జలవనరులు (గోదావరి -కృష్ణ లోయ అభివృద్ధి కార్పొరేషన్)
- హసన్ మియాలాల్ - వైద్య విద్య
- చంద్రకాంత్ సరస్వతి - ఉన్నత, సాంకేతిక విద్య, శాసనసభ వ్యవహారాలు
- గిరీశ్ గీతా దత్తాత్రేయ మహాజన్ - జలవనరులు ( విదర్భ, తాపి, కొంకణ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), విపత్తు నిర్వహణ
Maharashtra Portfolio Allocation | CM Devendra Fadnavis gets Home Ministry; Law & Judiciary
— ANI (@ANI) December 21, 2024
Deputy CM Eknath Shinde gets Urban Development & Housing and Public Works.
Deputy CM Ajit Pawar gets Finance & Planning and Excise dept pic.twitter.com/49EzXijvkd
Maharashtra Portfolio Allocation | Pankaja Mude gets the charge of Environment, Climate Change & Animal husbandry pic.twitter.com/g4VejpmrVW
— ANI (@ANI) December 21, 2024
మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం!
మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. అనంతరం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ముంబయి ఆజాద్ మైదాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతోపాటు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
భారీ విజయం
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం దక్కించుకుంది. 288 అసెంబ్లీ స్థానాలకుగానూ మహాయుతి కూటమి మొత్తంగా 230 సీట్లు సొంతం చేసుకుంది. అందులో బీజేబీ 132 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు గెలుపొందాయి.