ETV Bharat / state

'22 ఏళ్లు కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారు' - బన్నీ కన్నీంటి పర్యంతం - ALLU ARJUN ON THEARE INCIDENT

సంధ్య థియేటర్‌ ఘటనపై మరోసారి స్పందించిన అల్లు అర్జున్ - ఆరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించాననేది సరికాదన్న బన్నీ - తన క్యారెక్టర్‌ను ఒక్క ఘటనతో తక్కువ చేశారని ఆవేదన

Allu arjun On Sandhya Theatre Incident
Allu arjun On Sandhya Theatre Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

Updated : 29 minutes ago

Allu arjun On Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటనలో తన వ్యక్తితత్వాన్ని కించపరుస్తూ ఆరోపణలు చేయడం తగదని నటుడు అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తన 22 ఏళ్ల కష్టాన్ని ఒక్క రాత్రి తుడిచిపెట్టుకుపోయేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బన్నీ వాపోయారు. డిసెంబరు 4న జరిగిన ఘటనకు సంబంధించి సీఎం రేవంత్​ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్​ స్పందించారు. హైదరాబాద్​లోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.

ఆ రోజు జరిగిన ఘటన చాలా దురదృష్టకరం : పోలీసుల అనుమతితోనే తాను థియేటర్​ వద్దకు వచ్చానని అల్లు అర్జున్ చెప్పారు. బయట జరిగిన విషయాలపై పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. థియేటర్​ యాజమాన్యం వచ్చి చెబితేనే తాను వెళ్లిపోయానని బన్నీ వివరించారు. ఎలాంటి ర్యాలీలు, రోడ్​ షోలు చేయలేదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్‌ ఘటన జరిగినప్పటి నుంచి తన మీద కొంత తప్పుడు ప్రచారం జరుగుతోందని, తన క్యారెక్టర్‌ను కించరపరిచారని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పేర్కొన్నారు.

కుటుంబానికి అండగా ఉంటా : ఈరోజు తొక్కిసలాటలో చనిపోయిన మహిళ రేవతి, గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నానని అల్లు అర్జున్ తెలిపారు. శ్రీతేజ్​ భవిష్యత్​ బాగుండేలా బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తన వ్యక్తితత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేయడం పట్ల అల్లు అర్జున్​ కన్నీంటి పర్యంతమయ్యారు. 22 ఏళ్లుగా కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

"తెలుగువాళ్ల స్థాయిని పెంచేందుకే సినిమాలు చేస్తున్నా. ఎన్నో ఏళ్లపాటు కాపాడుకున్న క్యారెక్టర్‌ను ఒక్క ఘటనతో తక్కువ చేశారు. పిల్లలు తొక్కిసలాటలో ఉన్నారని తెలిసీ అలా చేసే వ్యక్తిని కాదు, అనుమతి ఇస్తే.. ఇప్పుడు కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తాను. తానెప్పుడు అభిమానులు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను" - అల్లు అర్జున్, సినీ హీరో

శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి గంటగంటకు తెలుసుకుంటున్నా నని, ఘటనపై మిస్‌ ఇన్‌ఫర్మేషన్‌, మిస్‌ కమ్యూనికేషన్‌ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉన్నారని తెలియడంటో మేనేజర్ బన్నీ వాసును పంపించానని.. తాను కూడా ఆస్పత్రికి వెళ్తానంటే, మరో ఘటన జరిగే అవకాశముందని వారించారని తెలిపారు. తొక్కిసలాట ఘటనతోనే సక్సెస్‌ మీట్‌ను కూడా రద్దు చేసుకున్నానని గుర్తుచేశారు.

శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా : అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ అరెస్ట్ - పోలీసుల తీరును ఖండించిన నేతలు

Last Updated : 29 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.