LIVE : వనపర్తిలో మార్గదర్శి చిట్ ఫండ్ 116వ శాఖ ప్రారంభం - ప్రత్యక్ష ప్రసారం - మార్గదర్శి చిట్ ఫండ్ 116వ శాఖ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 11:45 AM IST

Updated : Nov 16, 2024, 12:31 PM IST

Margadarsi Chit Fund LIVE : చిట్​ ఫండ్​ పరిశ్రమలో నమ్మకమైన, అగ్రగామిగా ఉన్న మార్గదర్శి చిట్​ ఫండ్​ సంస్థ తెలంగాణలోని వనపర్తిలో తన 116వ శాఖను ప్రారంభించింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ రామోజీ ఫిల్మ్​ సిటీ నుంచి వనపర్తి శాఖను వర్చువల్​గా ప్రారంభించారు. అక్కడి ఉద్యోగులతో మార్గదర్శి ఎండీ మాట్లాడారు. మార్గదర్శి, రామోజీ గ్రూప్​ ప్రధాన సంస్థ. 1962లో ప్రారంభమైనప్పటి నుంచి సహకార, ఆర్థిక సేవలతో అగ్రగామిగా ఎదుగుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బలమైన శాఖల నెట్​వర్క్​తో, కంపెనీ తన వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. నమ్మకం, పారదర్శకత, ఆర్థిక సాధికారతతో ధ్యేయంగా మార్గదర్శి చిట్​ ఫండ్​ సాగుతోంది. వనపర్తి శాఖ ప్రారంభంతో మరో మైలురాయిని మార్గదర్శి అందుకుంది. 116వ శాఖను ఏర్పాటు చేసుకుంది. వనపర్తి శాఖ ప్రారంభంతో ప్రతి ఇంటికీ విశ్వసనీయమైన ఆర్థిక పరిష్కారాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ ఈనాడు గ్రూప్​ సంస్థల ఛైర్మన్ రామోజీరావు జయంతి.
Last Updated : Nov 16, 2024, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.