BSNL Live TV: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL.. కొత్త ప్లాన్స్, 4G నెట్ వర్క్ విస్తరణతో రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో కొత్త సేవలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. దేశంలో బీఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ సేవలు ప్రారంభించింది. దీంతో ఫైబర్ యూజర్లు 500 లైవ్ టీవీ ఛానళ్లను ఉచితంగా వీక్షించొచ్చని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ సర్వీసులను తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో తీసుకొచ్చినట్లు పేర్కొంది.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ లైవ్ టీవీ సర్వీసులు ఫైబర్ టు హోమ్ (FTTH) యూజర్లకు మాత్రమే లభిస్తాయని తెలిపింది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా దీనిపై ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కాగా బీఎస్ఎన్ఎల్ ఈ సేవలను 'ఫస్ట్ ఇన్ ఇండియా'గా పిలుస్తోంది. అదేంటి ఇప్పటికే ఇండియాలో Jio Tv+ ఉంది కదా? మరి ఈ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఎలా మొదటిది అవుతుందని అనుకుంటున్నారా? అయితే ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీఎస్‌ఎన్‌ఎల్ లైవ్ టీవీ సర్వీస్ పూర్తిగా FTTH పై నడుస్తుంది. అయితే జియో టీవీ ప్లస్ మాత్రం పూర్తిగా HLS ఆధారిత స్ట్రీమింగ్పై నడుస్తుంది. ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం వుంది. జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి సంస్థలు టీవీ ఛానళ్లను వీక్షించినప్పుడు వినియోగించే డేటా నెలవారీ కోటా నుంచి మినహాయిస్తున్నాయి. జియో టీవీ ప్లస్ అనేది ఇంటర్నెట్ ప్లాన్‌పై ఆధారపడి నడుస్తుంది. అయితే బీఎస్ఎన్‌ఎల్ లైవ్ టీవీ ఛానళ్లు డేటాతో సంబంధం లేకుండానే లభిస్తాయి.
అంతేకాక ఇంటర్నెట్ స్పీడ్‌ను బట్టి వీటిలో కంటెంట్ క్వాలిటీ మారుతుంది. అయితే బీఎస్ఎన్‌ఎల్ లైవ్ టీవీ సర్వీస్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌తో పనిలేకుండా సాఫీగా స్ట్రీమింగ్ అవుతుంది. బఫర్ సమస్య లేకుండా హై స్ట్రీమింగ్ క్వాలిటీతో టీవీ ఛానళ్లను వీక్షించొచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఈ ఛానల్స్ కోసం ఎలాంటి ఎక్స్‌ట్రా ఫీజు చెల్లించకుండానే ఫ్రీగా పొందొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ఈ కేటగిరిలో మొదటిది అని కంపెనీ అంటోంది.
#BSNL redefines home entertainment with IFTV – India’s First Fiber-Based Intranet TV Service! Access 500+ live channels and premium Pay TV content with crystal-clear streaming over BSNL’s FTTH network. Enjoy uninterrupted entertainment that doesn’t count against your data limit!… pic.twitter.com/ScCKSmlNWV
— BSNL India (@BSNLCorporate) November 11, 2024
ప్రస్తుతానికి ఐఎఫ్‌టీవీ సేవలు ఆండ్రాయిడ్ టీవీల్లో మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఆండ్రాయిడ్ 10, ఆపై వెర్షన్ వాడుతున్న యూజర్స్ ఈ బీఎస్‌ఎన్‌ఎల్ లైవ్‌టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వీటిని వీక్షించొచ్చని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ త్వరలోనే ఈ సేవలను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఫైబర్ కస్టమర్లకు అపరిమిత డేటా లభిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ నెట్‌ఫ్లిక్స్, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు గేమ్స్ కూడా అందిస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
కొత్త కారు కొనాలా?- అయితే మారుతి డిజైర్‌పై ఓ లుక్కేయండి- వేరియంట్ వారీగా ఫీచర్లు ఇవే..!
మీరు యాపిల్ డివైజస్ వాడుతున్నారా?- అయితే కేంద్రం హైరిస్క్ అలర్ట్- వెంటనే ఇలా చేయండి!