ETV Bharat / offbeat

ఈ రైలుకు ఓనర్ సంపూరన్ సింగ్ - అతను ఒక రైతు! - ఈ విషయం మీకు తెలుసా? - SWARNA SHATABDI EXPRESS OWNER

-స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలుకు యజమానిగా రైతు -రైల్వే అధికారుల తప్పిదంతో రైలుకు రైతు పేరు

Swarna Shatabdi Express Owner
Swarna Shatabdi Express Owner (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 3:11 PM IST

Swarna Shatabdi Express Owner Details: సాధారణంగా అత్యంత సంపన్నులైన వ్యక్తులు, ఫేమస్​ సెలబ్రిటీల పేరు మీద విమానాలు, జెట్​లు, హెలికాప్టర్లు, షిప్​లు వంటివి ఉన్నట్లు వింటుంటాం.. చదువుతుంటాం. కానీ, ఒక రైలుకు ఫలనా వ్యక్తి యజమాని అని మీరెప్పుడైనా విన్నారా? విని ఉండరు. ఎందుకంటే మన దేశంలో అది సాధ్యం కాదు. భారతీయ రైల్వేలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే కొనసాగుతున్నాయి. అయితే గతంలో రైల్వే అధికారులు చేసిన ఒక పొరపాటుతో స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు(Swarna Shatabdi Express)కు ఒక రైతు కొన్నాళ్లు యజమానిగా ఉండాల్సి వచ్చింది. రైల్వే చరిత్రలోనే ఇది ఒక అసాధారణ ఘటన. ఆ వివరాలు మీకు తెలుసా? ఇంతకీ ఎవరా రైతు? ఏంటా కథ? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఒక సాధారణ రైతు.. రైలుకు యజమాని అయిన ఈ అసాధారణ ఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది. పూర్తి వివరాలు చూస్తే.. 2007లో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్‌ నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ ప్రక్రియలో రైల్వే అధికారులు చేసిన తప్పిదమే ఈ ఘటనకు కారణం. లుథియానాలోని కటానా అనే గ్రామంలో భూసేకరణ కోసం రైతులకు ఎకరానికి రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, కొన్ని సంవత్సరాలకు తమ సమీప గ్రామంలో ఎకరానికి రూ.71 లక్షలు చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న సంపూరణ్‌ సింగ్‌ అనే రైతు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించారు. తమకూ అంతే మొత్తంలో పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో రైల్వే శాఖ ఎకరానికి పరిహారాన్ని రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంచింది.. అయినా ఆ రైతు వెనక్కి తగ్గకపోవడంతో ఆపై పరిహారం రూ.1.47కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని నార్తన్‌ రైల్వే 2015 లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ రైల్వే అధికారులు చెల్లించలేదు.

దీంతో సంపూరణ్‌ సింగ్‌ తనకు అందాల్సిన పూర్తి పరిహారం కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించారు. రైల్వే శాఖ 2017 వరకు తనకు కేవలం రూ. 42లక్షలు మాత్రమే చెల్లించిందని.. కేసు గెలిచినా పూర్తి మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి జస్పాల్‌ వర్మ ఇచ్చిన తీర్పు అప్పట్లో సంచలనమే సృష్టించింది. దిల్లీ-అమృత్‌సర్‌ స్వర్ణ్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలుతో పాటు లుథియానాలోని స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయాన్ని జప్తు చేయాలని జడ్జి ఆదేశించారు. కోర్టు ఇచ్చిన అసాధారణ తీర్పుతో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా రైతు సంపూరణ్​ సింగ్​ చరిత్ర సృష్టించారు. అయితే, ఆ తర్వాత రైల్వే అధికారులు కోర్టును ఆశ్రయించడంతో ఆ ఆదేశాలు రద్దయినా.. ఒక రైలుకు రైతు యజమానిగా ఉన్న ఆ సందర్భం మాత్రం రికార్డుల్లో నిలిచిపోయింది.

దేశంలో నత్తలాగా నడిచే ఏకైక రైలు ఇదే - గమ్యస్థానం చేరడానికి 37 గంటలు - అదే ఎక్కుతామంటున్న ప్రయాణికులు!

బ్లూ, రెడ్‌, గ్రీన్ - రైల్‌ కోచ్‌ల కలర్​కు ప్రత్యేక కారణం! రంగు బట్టి లగ్జరీలో తేడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.