ETV Bharat / state

ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - సెర్చ్ వారెంట్ జారీ - AP

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం గాలింపు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 12:24 PM IST

Police Search for YS Avinash Reddy PA : వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పులివెందుల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతనిపై సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి నోటీసు అంటించారు. ఏ క్షణంలోనైనా ఇంట్లో సోదాలు చేయడానికి పర్మిషన్ తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇంట్లో వస్తువులు, డిజిటల్ డాక్యుమెంట్లు, అనుమానాస్పద వస్తువులు సీజ్ చేసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. మరోవైపు వారం రోజుల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు.

అయితే రాఘవరెడ్డి కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి పీఏ ఆదేశాల మేరకే వివేకా కుమార్తె సునీతారెడ్డిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టానని వర్రా రవీందర్​రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతనంలోకి వెళ్లిన రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు అతడి స్వగ్రామం అంబకపల్లెలో నిఘాపెట్టి, పులివెందుల, లింగాల మండలాల్లో నిఘా పెట్టారు. మరోవైపు వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి పోలీసుల 41-ఎ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్​రెడ్డితోపాటు సజ్జల భార్గవ్​రెడ్డి, అర్జున్​రెడ్డిపై ఐటీ, బీఎన్ఎస్, అట్రాసిటీ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

"వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఆ ముగ్గురే కీలకం" : వర్రా రవీందర్‌రెడ్డి

వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ - కడప ​జైలుకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.