ETV Bharat / state

ఆదివారమే గ్రూప్​-2 పరీక్ష - ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి - APPSC GROUP 2 MAINS EXAM

ఈ నెల 23న గ్రూపు-2 మెయిన్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

AP CS VIJAYANAND
AP CS VIJAYANAND (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2025, 9:28 PM IST

APPSC GROUP 2 MAINS EXAM: ఈనెల 23వ తేదీ (ఆదివారం) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పరీక్షల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఎ.అనురాధతో కలసి ఆయన అధికారులతో సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు 92,250 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు.

తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు: ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2: 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్-1 పరీక్ష ఉంటుంది, అభ్యర్ధులు ఉదయం 9.30 గంటల లోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయాలి, ఆలస్యంగా వచ్చిన ఎవరినీ లోనికి అనుమతించరు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకూ పేపర్-2 పరీక్ష ఉంటుంది, అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలలోగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి ఆ తర్వాత అభ్యర్థులెవరినీ లోనికి అనుమతించరు.

ఎలక్ట్రానిక్ వాచీలు అనుమతించరు: గ్రూప్​-2 మెయిన్ పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో పరీక్షలు వాయిదా పడతాయని, ఇతర దుష్ప్రచారం జరుగుతోందని, అటువంటివేమీ అభ్యర్ధులు నమ్మవద్దని ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ స్పష్టం చేశారు. అలాగే పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్సు, నెట్ కేంద్రాలన్నీ మూసి ఉంచాలన్నారు. పరీక్ష హాలులోకి మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర పరికరాలను ఎట్టిపరిస్థితుల్లోను అనుతించరాదని తెలిపారు.

మరోవైపు ఆదివారం జరగనున్న గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఆపాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత పిటిషన్స్​లో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్-2 ఫలితాలు ఉంటాయని వెల్లడించింది. నోటిఫికేషన్​లో మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు, క్రీడాకారులు, దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్లను కొట్టివేసింది.

CS Review on Inter Exams: అదే విధంగా మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగన్నాయి. ఈ పరీక్షల ఏర్పాట్లపైనా సీఎస్ కె.విజయానంద్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. వేసవి దృష్ట్యా ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు, విద్యుత్, బెంచ్​లు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.

గ్రూప్​-2 పరీక్షకు ఇలా ప్రిపేర్​ అయితే మంచి మార్కులు పక్కా!

ఏపీ యువతకు గుడ్​న్యూస్ -ఈ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ప్రకటించిన APPSC

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.