అమ్మమ్మ ఇంట్లో నెల రోజుల కొడుకు.. చూసేందుకు వెళ్తుండగా ఘోరం.. అక్కడికక్కడే తండ్రి మృతి - ప్రమాద వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 7, 2023, 3:57 PM IST

గుజరాత్​లోని వడోదరలో స్కూటీని తప్పించబోయి నేరుగా డివైడర్​ను ఢీకొట్టాడు ఓ బైకర్​. ఈ ఘటనలో బైకర్​కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కరేలీబాగ్ పోలీస్ స్టేషన్​ పరిధిలో దీపికా గార్డెన్ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని రాజేశ్​ భాయ్ సోలంకి(26)గా పోలీసులు గుర్తించారు. అతడు వడోదరలోని జవహర్ పలియా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రాజేశ్​ భాయ్ ప్రతాప్​నగర్​లోని ఓ ప్రైవేటు స్కూల్​లో స్వీపర్​గా పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితమే రాజేశ్​కు కుమారుడు పుట్టాడు. అప్పటి నుంచి రాజేశ్​​ భార్య.. ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. గురువారం వారిని చూసేందుకు రాజేశ్​ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో రాజేశ్​ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో రాజేశ్​ తలకు హెల్మెట్​ ధరించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనకు కారణమైన స్కూటీ డ్రైవర్​ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.