పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 8 రైళ్లు రద్దు.. సహాయక చర్యలు ముమ్మరం - రాజస్థాన్ లో గూడ్స్ రైలు
🎬 Watch Now: Feature Video
Goods Train Derails Near Jaipur : దేశంలో గత కొద్దిరోజులుగా వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జైపుర్ జిల్లాలో ఓ గూడ్స్ రైలుకు సంబంధించిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం జరిగిందీ ఘటన.
జైపుర్-మదార్ రైల్వే సెక్షన్‌లో జాబ్నర్, హిర్నోడా స్టేషన్‌ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు (నెంబర్- PJCR-ALKP ) పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పలు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో వెళ్లే 8 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. రైలు రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
జైపుర్- మార్వార్ (19735), మార్వార్- జైపుర్ (19736), జైపుర్- జోధ్‌పుర్ (22977), జోధ్‌పుర్- జైపుర్ (22978), అజ్మేర్- జైపుర్ (09605), జైపుర్- అజ్మేర్ (09606), జైపుర్- ఉదయ్‌పుర్ (09721), జైపుర్- సూరత్‌గఢ్ రైళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి.