ఫుల్​ జోష్​తో ఏనుగు బర్త్​డే పార్టీ.. వారికి స్వీట్స్ పంచిపెట్టిన ఆండాళ్ - తమిళనాడులో ఏనుగు బర్త్​డే వేడుకలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 1, 2023, 2:31 PM IST

తమిళనాడులో ఓ ఏనుగు తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు స్వీట్స్ పంచిపెట్టింది. ఏనుగేంటి బర్త్​డే సెలబ్రేట్​ చేసుకోవడమేంటి అనుకుంటున్నారా! తిరుచ్చి జిల్లాలోని శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంలో ఉండే 'ఆండాళ్'​ అనే ఏనుగు ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ రంగనాథ ఆలయంలో ఉండే ఆండాళ్​కు అక్కడ అధికారులు, పూజారులు కలిసి మంగళవారం 45వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇందుకోసం గుడిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆండాళ్​కు ఇష్టమైన వివిధ రకాల పండ్లను తెచ్చిపెట్టారు. వాటన్నింటినీ ముక్కలుగా చేసి ఆలయాధికారులు, భక్తులు కలిసి బర్త్​డే ఏనుగుకు తినిపించారు. పుట్టినరోజు వేడుకల్లో మునిగితేలిన ఆండాళ్​ ఎంతో ఉత్సాహంగా వారు సమర్పించిన ఫ్రూట్స్​ను ఎంచక్కా ఆరగించింది. గుడికి వచ్చిన భక్తులకు, చిన్నారులకు మిఠాయిలిచ్చి ఆశీర్వదించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.