Dhulipalla Narendra on Chandrababu తెలుగుజాతి కోసం పాటుపడిన వ్యక్తి చంద్రబాబు.. రేపటి రోజు ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది - Dhulipalla Narendra

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 10:48 PM IST

Dhulipalla Narendra on Chandrababu Remand: తెలుగుజాతి కోసం, ప్రజాశ్రేయుస్సు కోసం పనిచేసిన మచ్చ లేని వ్యక్తి చంద్రబాబును జైలుకు పంపించారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఇది ప్రభుత్వ రాజకీయ కుట్ర అని.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రంపంచం నలుమూలలకు వ్యాపింపజేయడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎంతో మంది సామాన్యుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్న ధూళిపాళ్ల.. కచ్చితంగా రేపటి రోజున విజయం సాధిస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్​ ముందుకు వెళ్తుందని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ నిరాశపడాల్సిన పనిలేదని.. యువ నాయకుడు లోకేశ్ నాయకత్వంలో న్యాయపోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అంతా ఏకమై ధర్మాన్ని గెలిపిద్దామన్నారు. 

Dhulipalla Narendra Kumar Counter to Sajjala Ramakrishna Reddy: జగన్ రొమ్మువిరిచి నిలబడ్డారని సజ్జల అంటున్నారు.. కోడికత్తి కేసులో జగన్ ఎందుకు సాక్ష్యం ఇవ్వలేదని ప్రశ్నించారు. సొంతబాబాయిని హత్య చేసిన వ్యక్తిని ఎందుకు జైల్లో పెట్టలేదని.. కొందరు పోలీసు అధికారులను మీ కిరాయి జీతగాళ్లుగా భావిస్తున్నారని సజ్జల రామకృష్ణకి కౌంటర్ ఇచ్చారు. మీ కిరాయి జీతగాళ్లుగా మారిన పోలీసు అధికారులపై పోరాటం కొనసాగిస్తామని.. ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగంపైనా పోరాడతామని ధూళిపాళ్ల తెలిపారు. కోర్టులను మేనేజ్ చేయడం జగన్‌కు తప్ప వేరెవరికీ చేతకాదని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.