క్యూలో నిలబడి నీళ్లు తాగిన పాములు.. వీడియో వైరల్! - క్యూలో నిలబడి నీళ్లు తాగిన పాముల వార్తలు
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాలో ఓ వింత సంఘటన జరిగింది. జనావాసాల్లోకి రెండు నాగుపాములు వచ్చి కలకలం సృష్టించాయి. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ బృందం వాటిని పట్టుకుని ఓ బాక్సులో బంధించారు. అనంతరం వాటిని అడవిలో వదిలేందుకు తీసుకెళ్లారు. వాటిని బయటకు తీసే క్రమంలో పెట్టెలో అతివేడి కారణంగా అవి ఒక్కసారిగా బుసలు కొట్టడం ప్రారంభించాయి. దీంతో అవి తీవ్రమైన దాహంతోనే ఇలా చేస్తున్నాయని గమనించారు అధికారులు. ఆలస్యం చేయకుండా ప్లాస్టిక్ బాటిల్లో నీరు తీసుకొచ్చి వాటి దాహార్తిని తీర్చారు అధికారులు. ఆశ్చర్యంగా ఒకటి తర్వాత ఒకటి క్యూలో నిలబడి మరీ నీళ్లను తాగాయి. అనంతరం వీటిని సురక్షితంగా అడవిలోకి వదిలారు రెస్క్యూ సిబ్బంది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా, గత రెండు మూడేళ్లుగా కోర్బా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నాగుపాములు తరచూ దర్శనిమిస్తున్నాయి. వాటి సంఖ్య కూడా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఇలా జనావాస ప్రాంతాల్లో అవి కనిపించిన ప్రతిసారి వాటిని పట్టుకొని అడవుల్లోకి వదులుతున్నారు అధికారులు.