New 108 Ambulances: కొత్తగా మరో 146 అంబులెన్స్‌లు.. ప్రారంభించిన సీఎం జగన్ - కొత్త 108 వాహనాలను ప్రారంభించిన జగన్
🎬 Watch Now: Feature Video
AP CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 146 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత కొంత కాలంగా కాలం చెల్లిన 108 అంబులెన్స్‌లతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు 146 కొత్త అంబులెన్స్‌లను రోడ్డుపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 108 అంబులెన్స్‌లకు అదనంగా మరో 146 కొత్త అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఉషాశ్రీ చరణ్‌తో పాటుగా పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మెుత్తం రూ. 34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసింది. కొత్త అంబులెన్సుల చేరికతో రాష్ట్రంలో ప్రస్తుతం 768 అంబులెన్స్‌లు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇవీ మెుత్తంగా 705 సెగ్మెంట్లను కవర్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 676 మండల సెగ్మెంట్లు, 29 అర్బన్ సెగ్మెంట్లలో అంబులెన్స్‌లు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు.