Chiranjeevi Comments on Government Full Video: ఆ రోజు చిరంజీవి ఏమన్నారంటే..! పూర్తి వీడియో - వైసీపీ ప్రభుత్వం మెగాస్టార్ వ్యాఖ్యలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2023, 10:10 PM IST

Chiranjeevi Comments on Government Full Video: ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.. దానికి సంబంధించిన పూర్తి వీడియో తాజాగా విడుదలైంది. "పిచ్చుకపై బ్రహ్మాస్త్రం" అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ఏపీలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అసలు చిరంజీవి ఏమన్నారంటే.. 'సినిమా వాళ్ల రెమ్యూనరేషన్‌ గురించి పార్లమెంటులో మాట్లాడుతున్నారు.. రెమ్యూనరేషన్‌ తీసుకోవడం తప్పు అన్నట్లుగా ఎత్తి చూపొద్దన్నారు.. రెమ్యూనరేషన్‌ అంశం రాజ్యసభ వరకు తీసుకెళ్లొద్దని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.. వ్యాపారం జరుగుతోంది కాబట్టే సినిమాలు చేస్తున్నామని, వ్యాపారం జరుగుతోంది గనకే సినిమా తమకు ఇస్తున్నారన్నారు.. సినిమాలు చేస్తున్నాం కాబట్టే తమకు డబ్బులు, పలువురికి ఉపాధి లభిస్తోంది' అని ఆయన అన్నారు.

దేశంలో సినీ పరిశ్రమ కంటే పెద్ద సమస్య ఇంకేదీ లేదన్నట్లు చూస్తున్నారని, పార్లమెంట్‌లో కూడా వీటిపై మాట్లాడుతుండటం చాలా దురదృష్టకరమని చిరంజీవి అన్నారు. రాజకీయాలతో పోల్చుకుంటే సినిమా చాలా చిన్నదని తెలిపారు. సినిమాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. సినిమా కష్టాలేవో తామే పడతామని, తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నందునే ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఖర్చు పెడుతున్నందునే ఆదాయం రావాలని కోరుకుంటున్నామని, వీలైతే ప్రభుత్వాలు సహకరించాలి గానీ అణగదొక్కడానికి ప్రయత్నించకండి అని చిరంజీవి అన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.