Chandrayaan-3 Vinayaka Buzzing in Vijayawada: విజయవాడలో చంద్రయాన్‌-3 వినాయకుడు సందడి.. వీడియో వైరల్ - Chandrayaan3 Vinayakadu news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 10:55 PM IST

Updated : Sep 18, 2023, 11:00 PM IST

Chandrayaan-3 Vinayaka Buzzing in Vijayawada: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా మండపాల్లో బొజ్జ గణపయ్యలు కొలువుదీరీ.. భక్తుల చేత ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ప్రపంచం గర్వపడేలా మనదేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 పేరుతో రాకెట్ తయారు చేసి, చంద్రుని వద్దకు పంపిన విషయం తెలిసిందే. ఆ స్ఫూర్తితో విజయవాడలో చంద్రయాన్‌-3 రూపంలో తయారు చేసిన గణపతి విగ్రహం భక్తులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Chandrayaan-3 is Ganesha Viral: విజయవాడలో చంద్రయాన్‌-3 వినాయకుడు సందడి చేస్తున్నాడు. చంద్రయన్ విజయాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేస్తూ.. వన్ టౌన్ పూజారి వీధిలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. చందమామ ప్రతిమతోపాటు రాకెట్ నమూనాను ఏర్పాటు చేశారు. ఇది ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇక్కడ కొలువైన బాల వినాయకుడి మూలవిరాట్టును నాలుగు కిలోల బంగారంతో అందంగా తీర్చిదిద్దారు. వినాయక ఉత్సవాల సందర్భంగా మరోసారి చంద్రయాన్‌-3 ఖ్యాతిని తెలియజేసేందుకే ఈ చంద్రయాన్‌-3 వినాయకుడిని ఏర్పాటు చేశామని నిర్వాహకులు వెల్లడించారు.

Last Updated : Sep 18, 2023, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.