Chandrababu Naidu: 'హైదరాబాద్‌లో అడుగడుగునా టీడీపీ గుర్తు ఉంటుంది' - ఇఫ్తార్ విందు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18278270-795-18278270-1681742336999.jpg)
Chandrababu Naidu at Iftar dinner: హిందూ-ముస్లిం భాయిభాయి అనేదే తెలుగుదేశం సూత్రమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అడుగడుగునా టీడీపీ గుర్తు ఉంటుందని.. కర్ఫ్యూ నగరాన్ని కొవిడ్ టీకా అందించే నగరంగా మార్చింది టీడీపీ ప్రభుత్వమేనని బాబు గుర్తు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంతోనే పాతబస్తీ అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా టీడీపీ గుర్తు ఉంటుందని స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశామని, ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించింది టీడీపీ హయాంలోనేనని పేర్కొన్నారు.
హిందూ-ముస్లిం భాయిభాయి అన్నదే టీడీపీ సూత్రం. టీడీపీకి ముందు, తరువాత అనేలా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్‌లో అడుగడుగునా టీడీపీ గుర్తు ఉంటుంది. కర్ఫ్యూ నగరాన్ని కొవిడ్ టీకా అందించే నగరంగా మార్చింది టీడీపీ. శంషాబాద్ విమానాశ్రయంతో పాతబస్తీ అభివృద్ధి జరిగింది. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించింది టీడీపీ.- చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత