రేపు చంద్రబాబు కంటికి ఆపరేషన్ - ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు - skill development case
🎬 Watch Now: Feature Video


Published : Nov 6, 2023, 4:28 PM IST
Chandrababu Eye Cataract Operation: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏఐజీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు ఈ రోజు మరోసారి ఆయనకు పలు పలు రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలకు కూడా చికిత్స అందించనున్నారు. ఇప్పటికే రెండు రోజులు ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి పరీక్షలు కూడా చేయించుకున్నారు.
మంగళవారం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో వైద్యులు బాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనున్నారు. చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నప్పుడు తీవ్ర అలర్జీ, అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ లభించడంతో చంద్రబాబు బుధవారం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఏఐజీ ఆసుపత్రిలో బాబు జాయిన్ అయ్యారు. చంద్రబాబు ఒక రోజు అంతా ఆసుపత్రిలోనే ఉండగా వైద్యులు వివిధ పరీక్షలు చేశారు.