Car Accident Viral Video : అతివేగంతో వృద్ధుడిపైకి దూసుకెళ్లిన కారు.. లారీ కింద పడి యువ దంపతులు మృతి - స్కూటీని ఢీకొట్టిన లారీ యువ జంట మృతి గాజియాబాద్
🎬 Watch Now: Feature Video
Published : Sep 13, 2023, 11:07 PM IST
Car Accident Viral Video In Tamil Nadu : తమిళనాడు.. నమక్కల్ జిల్లాలో వేగంగా వస్తున్న ఓ లగ్జరీ కారు అదుపుతప్పి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. కీరంపుర్ టోల్ ప్లాజ్ సమీపంలోని వంపుగా ఉన్న మార్గంలో జరిగిన ఈ ఘటనలో జ్ఞానశేఖరన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న బాలు స్వామి, రాజన్, సంతోష్‌లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అనంతరం వీరిని నమక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ కింద పడి యువ తంపతులు మృతి..
ఉత్తర్‌ప్రదేశ్.. గాజియాబాద్‌లో లారీ కింద పడి యువ దంపతులు మృతి చెందారు. రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా సమీపంలో ఒమేగా కూడలిలో వెళ్తున్న ఓ లారీని.. స్కూటీపై వెళ్తున్న యువ తంపతులు ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో లారీ ఢీకొట్టడం వల్ల.. దాని కింద పడిపోయారు. అనంతరం వారి పైనుంచి లారీ వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన దంపతులను హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ వారిద్దరూ మృతిచెందారు. వీరిద్దరు అసోంలోని మాల్బజార్ సిలిగుడికి చెందిన వారని.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు నందగ్రామ్ ఏసీపీ రితేశ్ త్రిపాఠి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.