బంపర్ ఆఫర్.. స్మార్ట్ ఫోన్ కొంటే 2 కిలోల టమాటాలు ఫ్రీ.. ఎక్కడంటే? - మొబైల్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ అశోక్‌నగర్
🎬 Watch Now: Feature Video
Buy Smartphone Get 2 kg Tomatoes : కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడం మామూలే. అందులో భాగంగానే ఇప్పుడు టమాటాల ధరలకు రెక్కలొచ్చాయి! ప్రస్తుతం కిలో టమాట ధర రూ. 100 నుంచి రూ. 200 వరకు పలుకుతోంది. దీని కారణంగా ఆహార దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ సంస్థ తమ మెనూ నుంచి టమాటాలను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పెరిగిన టమాటా ధరలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఓ వ్యక్తి. తన సెల్‌ఫోన్ షాపులో స్మార్ట్‌ఫోన్ కొంటే.. 2 కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని విచిత్ర ఆఫర్‌ను ప్రకటించాడు. దీంతో మొబైల్ ఫోన్లు అమ్ముడుపోయాయని చెబుతున్నాడు.
ఇదీ జరిగింది.. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ పట్టణంలో ఓ సెల్‌ఫోన్ నడుపుతున్నాడు అశోక్ అగర్వాల్ అనే వ్యక్తి. కొన్ని రోజులుగా పెరిగిన టమాటా ధరలు.. వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించాడు. దీంతో అతడికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా.. తన షాపులో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినవారికి రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని విచిత్ర ఆఫర్ ప్రకటించాడు. దీన్ని చూసిన వినియోగదారులు అశోక్ షాపునకు క్యూ కట్టారు. దీనిపై స్పందించిన అశోక్ ఈ ఆఫర్ వల్ల కస్టమర్ల సంఖ్య పెరిగిందని.. స్మార్ట్ఫోన్లు కూడా ఎక్కువగా అమ్ముడయ్యాయని సంతోషం వ్యక్తం చేశాడు.
TAGGED:
Ashoknagar in Madhya Pradesh